టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురికి కూడా ప్రేక్షకుల్లో అలానే అభిమానుల్లో మంచి పాపులారిటీ, క్రేజ్ ఉందనేది అందరికీ తెలిసిందే. మొదట అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్, ఆ తరువాత నుండి వచ్చిన అవకాశాలను సక్సెస్ లు గా మలచుకుని తనకంటూ ప్రత్యేకమైన పేరుని ఆడియన్స్ లో ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నారు పవన్. రాజకుమారుడు సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్, ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హిట్ కొట్టి తండ్రి కృష్ణకు తగ్గ తనయుడిగా మంచి పేరుందక్కించుకుని అన్ని వర్గాల ప్రేక్షకుల్లో తిరుగులేని హీరోగా గొప్ప ప్రఖ్యాతలు సంపాదించారు.

అతి త్వరలో ఆయన నటించనున్న సినిమా సర్కారు వారి పాట. ఇకపోతే నిన్ను చూడాలని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్, ఆ తరువాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో భారీ సక్సెస్ అందుకుని అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగారు. ఇక తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న యంగ్ టైగర్ కి అన్నివర్గాల ప్రేక్షలకులతో పాటు ముఖ్యంగా మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇకపోతే ఈ ముగ్గరు హీరోలు కూడా తమ తమ కెరీర్ లో చేసిన ఏడవ సినిమాలతో భారీ సక్సెస్ లు అందుకుని అక్కడినుండి మరింతగా దూసుకెళ్లారు అని చెప్పకతప్పదు. అయితే ఆ తరువాత వచ్చిన ఎనిమిదవ సినిమాలతో మాత్రం భారీ పరాజయాలు మూటగట్టుకుని అభిమానులను నిరాశపరిచారు. ఒక్కడు సంచలన విజయం తరువాత మహేష్ నటించిన నిజం సినిమా ఆశించిన రేంజ్ సక్సెస్ ని అందుకోలేదు. అయితే ఆ సినిమాలోని సీతారాం పాత్రలో అద్భుత నటనకు గాను మహేష్ కు ఉత్తమనటుడిగా రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు వచ్చింది.

ఇక తన ఏడవ సినిమా ఖుషితో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్, ఆ తరువాత తానే స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన జానీ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు. అయితే ఆ సినిమాలో పవన్ నటనకు ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించింది. ఇక తన కెరీర్ ఏడవ సినిమా అయిన సింహాద్రితో సంచలన విజయం అందుకున్న ఎన్టీఆర్, ఆ తరువాత వచ్చిన ఆంద్రావాలా మూవీతో ఊహించని విధంగా భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కాగా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన ఆ సినిమాలోని సాంగ్స్ మాత్రం శ్రోతలను విశేషంగా అలరించాయి. సో, ఈ విధంగా ఈ ముగ్గురు హీరోలు కూడా తమ ఏడవ సినిమాలతో భారీ సక్సెస్ లు అందుకుని మంచి క్రేజ్ దక్కించుకున్నప్పటికీ, ఊహించని విధంగా ఎనిమిదవ సినిమాలతో మాత్రం అపజయాలను చవిచూశారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: