టాలీవుడ్ ప్రేక్షకులకు అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, వెంకటేష్ హీరోగా తెరకెక్కిన కలియుగ పాండవులు సినిమాతో ఖుష్బూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది.  ఈ సినిమా తర్వాత కుష్బూ తమిళ సినిమాలతో ఫుల్ బిజీ అయి పోవడం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలలో నటించ లేకపోయింది, ఇది ఇలా ఇంతే తమిళ ఇండస్ట్రీలో మాత్రం  కుష్బూ స్టార్ హీరోయిన్ గా ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగింది.  ఇలా హీరోయిన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న కుష్బూ  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టాలిన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది,  ఆ తర్వాత కొంత కాలం పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా కుష్బూ ఆ తర్వాత యమదొంగ,  అజ్ఞాతవాసి సినిమాలలో నటించి మరో సారి తెలుగు ప్రేక్షకులను అలరించింది.

  ఇదిలా ఉంటే తాజాగా శర్వానంద్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కుష్బూ నటించింది,  ఈ సినిమా మార్చి 4 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.  ఇది ఇలా ఉంటే ఖుష్బూ,  శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కే సినిమాలో కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది,  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ కి వెల్ కమ్ చెబుతూ ఈ మూవీ టీమ్ అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది, ఇలా వరుస పెట్టి కుష్బూ తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తుంది. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా గోపీచంద్ కెరియర్ లో 30వ సినిమా, ఇది వరకే గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో లక్ష్యం,  లౌక్యం సినిమాలు తెరకెక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: