టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక గత వారమే పెళ్లి పీటలు ఎక్కాడు కుర్ర హీరో శర్వానంద్. జైపూర్ లోని లీల ప్యాలెస్ లో రక్షిత రెడ్డితో అంగరంగ వైభవంగా శర్వానంద్ పెళ్లి జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఈ యంగ్ హీరో పెళ్ళికి చాలామంది హాజరయ్యి నవ దంపతులను ఆశీర్వదించారు. ఇక ఈ పెళ్లికి శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్ మరియు సిద్ధార్థ కూడా వచ్చి సందడి చేశారు. ఇక శర్వానంద్ పెళ్లిలో వీరిద్దరూ కలిసి చేసిన రచ్చ మాములుగా లేదు. ఇప్పటికి వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

 ఇక రేపు శర్వా నంద మరియు రక్షిత రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగనుంది. ఇక ఈ నేపథ్యంలోనే శర్వానంద్ పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులను రిసెప్షన్కు ఆహ్వానించడానికి వెళ్ళాడు శర్వానంద్. అయితే తాజాగా శర్వానంద్ సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.శర్వానంద్ తాజాగా కేసీఆర్ ఇంటికి వెళ్లి మరి కెసిఆర్ ను కలవడం జరిగింది .తన రిసెప్షన్ కు రమ్మని మర్యాదపూర్వకంగా ఆహ్వానించాడు శర్వానంద్ .శర్వానంద్ ఆహ్వా నం అందుకున్న కేసీఆర్ తప్పకుండా వస్తాను అని శర్వానంద్ కి చెప్పినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం శర్వానంద్ మరియు కేసీఆర్ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజకీయ ప్రముఖులతో పాటు శర్వా రిసెప్షన్ కి టాలీవుడ్ మొత్తం కూడా హాజరు కానుంది. కాగా శర్వానంద్ మరియు రక్షిత రిసెప్షన్ హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శర్వా నంద పెళ్లి వేడుకల్లో ఉన్నాడు. ఇక ఈ హడావిడి మొత్తం పూర్తయిన తర్వాత శర్వా తన భార్యతో హనీమూన్ కి కూడా వెళ్లేందుకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక పెళ్లి కార్యక్రమాలు పని అంతా పూర్తయిన తర్వాత నిదానంగా తను కమిటైన సినిమాలు షూటింగ్లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: