టాలీవుడ్లో నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత ఇప్పుడిప్పుడే తప్పుకుంటోంది. అక్కినేని నవ మన్మథుడు నాగచైతన్యతో ఆమె పెళ్లి అయ్యాక ఆమె క్రమ క్రమంగా గ్లామర్ పాత్రలు ఒప్పుకోవడం తగ్గించేసింది. అయితే పెళ్లయ్యాక రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో ఆమె చేసిన లిప్ లాక్‌తో పెద్ద సంచలనమే క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక సమంత ప్రధాన హీరోలతో ఛాన్సులు వదులుకోవడం.. గతంలోలా రొమాన్స్ చేసే సీన్ లేకపోవడంతో ఇప్పుడు ఈ అవకాశాలు అన్నీ పూజా హెగ్డేకు వెళ్లిపోతున్నాయి. తాజాగా సమంత వద్దనుకున్న ఓ ఆఫర్ ను ఇప్పుడు పూజా హెగ్డే ఓకే చేసింది.
తమిళ్ లో శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు స్టార్ హీరో విజయ్. విజయ్ - సమంతది హిట్ కాంబినేషన్. మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలని అనుకున్నారు. అయితే సమంత వ్యక్తిగత కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ ప్లేస్‌లోకి పూజా హెగ్గే వచ్చి చేరింది. మరో ట్విస్ట్ ఏంటంటే కోలీవుడ్‌లో ఇది పూజాకు రీ ఎంట్రీ మూవీ. గతంలో జీవాతో ఆమె మాస్క్ సినిమా చేసింది. ఆ సినిమా క్లిక్ కాలేదు. ఇప్పుడు 8 ఏళ్ల గ్యాప్ తీసుకుని మళ్లీ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది.
ఈ సారి ఆమె ఉన్న ఫామ్ నేపథ్యంలో ఆమె కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయిపోతుందంటున్నారు. ఇక టాలీవుడ్లో కూడా ముందు ఆమె నటించిన సినిమాలు అనుకున్న రేంజ్లో ఆడలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో చేసిన డీజే మూవీ నుంచి దూసుకుపోతోంది. అదే మేజిక్ ఇప్పుడు కోలీవుడ్ లో కూడా విజయ్ సినిమాతో రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. మరి విజయ్ కోలీవుడ్‌లో పూజ ఫేట్ ఎలా మారుస్తాడో ? చూడాలి.