టాలీవుడ్ లో రాజకీయ నేపధ్యం ఉన్న సినిమాలకు కొదవ లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఎక్కువగా కొనసాగుతుంది. చిన్న హీరోలు లవర్ బాయ్స్ గా నటించాలని చూస్తుంటే పెద్ద హీరోలు ఇప్పుడు రాజకీయ నేపధ్యం ఉన్న సినిమాలు చెయ్యాలని ఆశపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సహా పలువురు రాజకీయ నేపధ్యం ఉన్న సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీనితో దర్శక నిర్మాతలు కూడా ఆ విధంగానే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. 

 

హీరోల పాత్రలను ఆ విధంగా రాయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే త్రివిక్రమ్ సినిమాలో అతని పాత్ర రాజకీయ నాయకుడిగానే ఉంటుంది అంటున్నారు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ చేసే సినిమా అలాగే ఉంటుంది అంటున్నారు. అదే విధంగా చిరంజీవి త్వరలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని ఆ సినిమాలో రాజకీయ నాయకుడి పాత్రలో ఆయన నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

 

ఇక మహేష్ బాబు వంశీ పైడపల్లి సినిమాలో కూడా మహేష్ బాబు రాజకీయ నాయకుడిగా నటించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఆ సినిమాలో మహేష్ బాబు మంత్రిగా నటించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. త్వరలోనే దీనిపై కూడా స్పష్టత రానుంది. ఇక గోపి చంద్ కూడా ఇలాంటి సినిమానే ఓకే చేసారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కొంత మంది హీరోలు అది సక్సెస్ ఫార్ములా అనుకుంటున్నారు. గతంలో ఇలా చేసిన హీరోలు చాలా మంది... సూపర్ హిట్స్ కొట్టారు. దీనితోనే రాబోయే సినిమాల్లో కూడా అలాగే కనపడాలని భావిస్తున్నారు. రామ్ చరణ్ కూడా అలాగే ఒక సినిమా చెయ్యాలని చూస్తున్నాడట. అల్లు అర్జున్ కూడా ఈ ప్రయత్నాల్లోనే ఉన్నాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: