రెండు మూడు రోజులుగా ఇంటర్నెట్ లో సినిమా విషయాల్లో జోరుగా వైరల్ అయిన వాటిల్లో ఒకటి హీరోయిన్ అమలాపాల్ పెళ్లి విషయమే. ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తున్న అమలాపాల్ సడన్ గా బాలీవుడ్ సింగర్ భవీందర్ సింగ్ ను పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది. భవీందర్ సింగ్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫొటోలను వెంటనే డిలీట్ చేయడం కూడా  చర్చనీయాంశమైంది.

 

 

సినీ వర్గాలను విస్మయపరచిన అమలాపాల్ పెళ్లి వ్యవహారం అబద్ధమని అమలాపాల్ చెప్పటం కూడా అంతే చర్చనీయాంశమవుతోంది. ఈ సడన్ మ్యారేజ్ పై అమలాపాల్ తన మేనేజర్ ద్వారా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తను పార్టనర్ గా ఉన్న ఓ వెంచర్ కోసం జరిగిన ఫొటోషూట్ లో భాగమే ఆ పెళ్లి అని చెప్తోంది. నిజంగా పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని కూడా చెప్తోంది. అయితే.. గతంలో వీరిద్దరూ డేటింగ్ చేసారని కూడా తెలుస్తోంది. ఈ ఫొటోలు భవీందర్ సింగ్ పోస్ట్ చేసి డిలీట్ చేశాడు. ఈ వ్యవహారంపై అలిగిందో ఏమో అమలాపాల్ మాత్రం భవీందర్ సింగ్ ను ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది.

 

 

పూర్తిగా పంజాబీ స్టైల్ లో జరిగినట్టున్న ఆ పెళ్లి ఫొటోలో అబద్దమని చెప్తే నమ్మశక్యంగా లేదు కూడా. పైగా ఇద్దరూ లిప్ కిస్ కూడా ఇచ్చుకున్నారు. అసలేమాత్రం పెళ్లి కళ లేని ఆ ఫొటోలను నమ్మోద్దని కూడా చెప్తోంది. తమిళ దర్శకుడు విజయ్ ను 2014లోనే వివాహం చేసుకుంది అమలాపాల్. తర్వాత వారిద్దరి మాధ్యా విబేధాలు వచ్చి విడాకులు తీసుకుంది కూడా. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి హీరో ధనుష్ కారణమని విజయ్ తండ్రి వ్యాఖ్యానించడం.. అమలాపాల్ ఆ వార్తలను ఖండించడం జరిగిని విషయాలే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: