టాలీవుడ్‌లో అల్లు బ్ర‌ద‌ర్స్ ప్ర‌స్థానం గురించి తెలిసిందే. అగ్ర‌నిర్మాత అల్లు అర‌వింద్ వార‌సుల్లో అల్లు అర్జున్ ఎంతో హార్డ్ వ‌ర్క్ తో స్టార్ గా త‌న‌ని తాను ప్రూవ్ చేసుకున్న విష‌యం తెలిసిందే. స్టైలిష్ స్టార్ గా ఫ్యాన్స్ లో త‌న ఇమేజ్ ని కాపాడుకోవ‌డంలో పెద్ద స‌క్సెస‌య్యారు. కెరీర్ ప‌రంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ ఇమేజ్‌ని త‌న సొంతం చేసుకున్నాడు.  హీరోగా త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకోవ‌డ‌మే గాక టాలీవుడ్ టాప్ 5 హీరోల్లో ఒక‌డిగా నిలిచారు. ఇక బ‌న్ని ప్రోద్భ‌లంతోనే బ‌రిలో దిగిన అల్లు శిరీష్ మాత్రం ఆశించిన స్థాయిలో హీరోగా రాణించ‌లేక‌పోయారు. శిరీష్ కొన్ని వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొని రేసులో పూర్తిగా వెన‌క‌బ‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఇక న‌ట‌న‌కు గుడ్ బాయ్ చెప్పేస్తున్నాడ‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే శిరీష్ మాత్రం వ‌రుస సినిమాల‌తో దూసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాన‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

 

శిరీష్ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్న స‌మ‌యంలోనే అల్లు అర‌వింద్ ఆస్తి పంప‌కాలు చేశార‌ని కూడా ప్ర‌చార‌మైంది. అన్న‌ద‌మ్ములిద్ద‌రికీ స‌రైన స‌మ‌యంలో ఆస్తుల్ని పంచేసి అర‌వింద్ తెలివైన ప‌ని చేశార‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. ఇక ఎవ‌రికి వారు ఎదిగే టైమ్ వ‌చ్చేసింది. ఆ క్ర‌మంలోనే శిరీష్ ఇక నిర్మాత‌గా సెటిల‌వుతార‌ని ప్ర‌చారం సాగుతోంది. అన్న హీరోగా స్థాయిని పెంచుకుంటుంటే .. త‌మ్ముడు మాత్రం నిర్మాత‌గా తండ్రి అర‌వింద్ బాట‌నే అనుస‌రిస్తార‌ని  అంద‌రూ భావిస్తున్నారు.

 

తాజా స‌మాచారం ప్ర‌కారం.. డాడీ ఇల్లు ఉన్నా.. అల్లు అర్జున్అల్లు శిరీష్ బ్ర‌ద‌ర్స్ ఇరువురూ ఎవ‌రికి వారు త‌మ‌కంటూ ఓ సొంత గూడు కావాల‌ని కోరుకోవ‌డ‌మే గాక‌.. అందుకు ప్ర‌ణాళిక‌లు కూడా వేసేసుకున్నార‌ట‌. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్ లోని అల్లు అర‌వింద్ ఇంట్లోనే ఉంటున్నా.. సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు ఇప్ప‌టికే. ప్ర‌స్తుతం ఇంటి నిర్మాణం శ‌ర‌వేగంగా సాగుతోంది. ఇప్పుడు శిరీష్ కూడా ప్రైవ‌సీ కోసం ఓ కొత్త అపార్ట్ మెంట్ కి షిఫ్ట‌య్యాడ‌న్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది. ఇంత‌కుముందు ఆస్తి పంప‌కాలు అంటూ ప్ర‌చారం వేడెక్కించ‌గా.. ఈసారి స‌ప‌రేట్ గా ఎవ‌రికి వారే అన్న మ్యాట‌ర్ వైర‌ల్ అవుతోంది. అయితే ఇందులో వాస్త‌వం ఎంతో బ్ర‌ద‌ర్స్ స్వ‌యంగా వెల్ల‌డిస్తారేమో చూడాలి. ఇక ఈ రోజుల్లో స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌య‌మే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: