టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా మంది ఇప్పుడు ఈ వ్యాఖ్యల గురించి పెద్ద ఎత్తున చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత టాలీవుడ్ లో చాలా మంది ఇప్పుడు అసలు ఎం జరుగుతుంది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మంచిది కాదని అగ్ర హీరోలు గా ఉన్న వ్యక్తులు హుందాగా ప్రవర్తించాలి గాని ఇలా రోడ్డు మీదకు వస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

 

ఇక ఇంత వరకు బాగానే ఉంది గాని నిన్న సాయంత్రం నాగ బాబు బాలకృష్ణ పై తీవ్ర విమర్శలు చేసారు. నోరు జారవద్దు బాలకృష్ణ అంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే బాగోదు అన్నట్టు ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇప్పుడు జనాలు ఆసక్తిగా చూసారు. చిరంజీవి ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ వాస్తవానికి కలిసే ఉంటుంది. బాలకృష్ణ ఎవరిని అన్నారు అనేది తెలియదు. కాని నాగ బాబు ఆవేశం  మాట్లాడారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. చిరంజీవి ఇంట్లో సమావేశం జరిగింది. 

 

నరేష్ కూడా తర్వాత మాట్లాడుతూ తనకే సమాచారం లేదు అని అన్నారు.  మరి బాలకృష్ణ కు ఏ విధంగా సమాచారం ఉంటుంది. ఇప్పుడు దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది. నాగబాబు ఆవేశ పరుడు అని ఆయన అనవసరంగా నోరు జారి మాట్లాడితే తర్వాత తేడాలు వస్తాయి అని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇక మెగా ఫాన్స్ కూడా ముందు బాలకృష్ణ ను తిట్టినా సరే తర్వాత ఆయన వాదన కరెక్ట్ అనే విధంగా మాట్లాడారు. నాగబాబు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని సూచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: