టాలీవుడ్ లో సినిమాలు లేక ప్రేక్షకులకు ఇప్పుడు మైండ్ పోయే విధంగా ఉంది పరిస్థితి. ఒక్క సినిమా విడుదల అయినా సరే చాలు అనుకుని ఎదురు చూస్తున్నారు. సినిమాల గురించి ఏదైనా ప్రకటన వస్తే చాలు పనులు మానుకుని కూడా చదువుతున్నారు. అయితే కొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండి కూడా విడుదలకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు పది సినిమాలు ఇలా విడుదల వరకు వచ్చి ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అగ్ర హీరోలు చిన్న హీరోలు అనే తేడా లేకుండా సినిమాలను వాయిదా వేసారు. 

 

ఇక ఇది పక్కన పెడితే సోలో లైఫే సో బెటరు అంటూ మెగా హీరో సాయి ధరం తేజ్ వస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తి అయి విడుదలకు కూడా సిద్దంగా ఉన్నా సరే సినిమా మాత్రం విడుదల కాలేదు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా లో నో పెళ్లి అనే సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముందు యువతను ఎక్కువగా ఆకట్టుకుంది ఆ సాంగ్. ఆ సాంగ్ ని చూసిన పెళ్లి అయిన వాళ్ళు కూడా వావ్ అన్నారు. ఆ సాంగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కూడా అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మాత్రం స్పష్టత లేదు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. 

 

ఇక ఓటీటీ లో ఈ సినిమా విడుదల అయ్యే సూచనలు దాదాపు గా లేవు అని సమాచారం. దర్శకుడు నిర్మాత అందుకు అంగీకరించడం లేదని హీరో కూడా అందుకు నో అంటున్నాడు అని సమాచారం. అందుకే సినిమా ఆలస్యం అయినా సరే అందులోనే విడుదల చెయ్యాలి అని భావిస్తున్నారు. మరి ఎం జరుగుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: