టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లోని  సినిమాల లో  అతి తక్కువ కాలంలో స్టార్ హీరోల తో సినిమాలు చేస్తూ అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన బొద్దుగుమ్మ రాశి.  జగపతి బాబు, శ్రీకాంత్, నవీన్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోల తో ఆమె చేసిన సినిమాలు ఆమెకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి అనే చెప్పాలి. అగ్ర హీరోల తో చాలా తక్కువ కాలంలో చాలా మంచి సినిమాలు చేసిన హీరోయిన్ గా ఆమెకు చాలా మంచి పేరు ఉంది. ఇక ఇదిలా  ఉంటే ఆమె కెరీర్ లో ఒక్కసారిగా ఆఫర్లను వదులుకుంది చెప్పాలి.

 

 



ఎన్నో హిట్ సినిమాల లో నటించిన ఈమె తెలుగు ప్రేక్షకుల మనసులో అందాల రాశిగా చెరగని ముద్ర వేసుకుంది.వ్యక్తిగత జీవితం లో  నివాస్ ను వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ బొద్దుగుమ్మ .. పెళ్లి  చేసుకున్న తర్వాత సినిమాల కు కొంచెం దూరంగా ఉన్నారు. అయితే  సినిమాల లో కథ డిమాండ్ ఉన్న కీలక పాత్రల్లో కనిపించారు. కొన్ని సినిమాల లో హీరోయిన్ తల్లిగా కూడా కనిపించారు. 

 

 

గోకులంలో సీత, శుభాకంక్షాలు  సినిమాల లో ఆమె చేసిన పాత్రలు ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ గా చెప్పవచ్చును. ఆ విధంగా ఆమె ఆ పాత్ర తో  కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో అక్కడి నుంచి ఆమెకు వరుసగా పాత్రలు వచ్చాయి. ఆమె సినిమాల కోసం ఇప్పటికి కూడా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. టీవీలలో ఆమె నటించిన సినిమాలు వస్తేఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా ప్రేక్షకులు చూస్తారనడంలో ఆశ్చర్యం లేదు.ఇప్పుడు ఆమె మళ్ళీ బరువు తగ్గి సినిమాలలో  నటించడానికి రెడీ అవుతుందనే వార్తలు వినపడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: