ఈ మధ్య సినిమాలు కథ ఉన్నా లేకున్నా కూడా సినిమాలో బోల్డ్ సన్నివేశాలు..అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ నుంచి తేరుకున్న ప్రేక్షకుల దృష్టిని తమ వైపు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు.చిన్న దర్శకులు అందరూ అదే పనిలో ఉన్నారు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ పచ్చిగా ఉండటంతో రసిక ప్రియులను బాగా ఆకట్టుకుంతుందనే చెప్పాలి.. వర్మ తీసే సినిమాలు అలా ఉంటాయి మరి.. ఇది ఇలా ఉండగా ఇప్పుడు వర్మ ను ఫాలో అవుతూ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ ప‌తాకంపై రామ్ లొడ‌గ‌ల ద‌ర్శ‌కత్వంలో ప‌ద్మ లెంక నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్ల‌ర్ `బ్లాక్డ్‌`. మ‌నోజ్ నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇటీవలే పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకొని ప్రమోషన్ లో బిజీగా ఉంది. అయితే సినిమా విడుదలకు ముందు సినిమా పై ఆసక్తిని కలిగించాలని చిత్రయూనిట్ తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేసింది.



ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ..హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా ఈ మూవీ తెర‌కెక్కింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ స‌హ‌కారంతో మూవీ ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది.ఇక నిర్మాత కూడా బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా అన్నీ అందించారు. ఈ సినిమా టీజర్ ను , సాంగ్స్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబొతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.మ‌నోజి నందం, శ్వేత సాలూరు, వినయ్ మహదేవ్, రామారావు లెంక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. మరి సినిమా ఏ రేంజులో ఉండబోతుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: