ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. దిల్ రాజు, బోనికపూర్ కలిసి సంయుక్తంగా ఎంతో భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న పింక్ అనే కోర్టు డ్రామా మూవీకి అధికారిక తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు మగువా మగువా సాంగ్ కూడా ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన రాబట్టి సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేశాయి. లాక్ డౌన్ కు ముందు చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుండగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.  

సినిమా టీజర్ ని దసరా కి రిలీజ్ చేస్తున్నారు అంటూ కొద్ది రోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా దసరాకు మరొక వారం రోజులు కూడా సమయం లేకపోవటం మరోవైపు ఈ మూవీ టీజర్ కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్ డేట్ రాకపోవడంతో పవర్ స్టార్ ఫాన్స్ నిరాశతో నిర్మాతలు దిల్ రాజు, బోనికపూర్ లని ఉద్దేశించి, సార్ అసలు మా హీరో మూవీ టీజర్ దసరాకు రిలీజ్ అవుతుందా లేదా తేల్చి చెప్పండి అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ యొక్క ఆవేదనను వకీల్ సాబ్ నిర్మాతలు గుర్తిస్తారా, అసలు వకీల్ సాబ్ టీజర్ దసరా పండుగ కానుకగా రిలీజ్ అవుతుందా లేదా తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: