ఈమధ్య విడుదల అయిన ‘ఆర్ ఆర్ ఆర్’ టీజర్ లో ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన జూనియర్ గెటప్ లో ఉపయోగించిన టోపీ ఒక మత విశ్వాసాలకు  ప్రతిబింబించే విధంగా ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ముందుగా ఆదివాసీ సంఘాల నుంచి ప్రతిఘటన ప్రారంభమైన తరువాత  భాజపా ఎంపీ కామెంట్స్ వరకు ఈ వ్యవహారం నడిచింది.


దీనితో కొందరు ఈ టోపీతో సినిమా తీస్తే అంగీకరించే సమస్యే లేదని హెచ్చరికలు ఇస్తున్నారు. అయితే రాజమౌళి లాంటి దర్శకుడుకి ఇలాంటి కామెంట్స్ పట్టించు కోకుండా ఈ కామెంట్స్ పై జక్కన్న తన మౌన ముద్ర కొనసాగిస్తున్నాడు. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న లీకుల ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో జూనియర్ కొంత సేపు ఇలా టోపీ తోనే కనిపిస్తాడని టాక్.


మూవీ కధలో ఈ టోపి కి కూడ ప్రాధాన్యత ఉంటుంది అని అంటున్నారు. దీనితో ఈ టోపీ గెటప్ పై కొందరు విమర్శలు చేసినా రాజమౌళి అసలు పట్టించుకోడు అని అంటున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ ను ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా చూపించడం లేదని అందువల్ల ఈ సమస్య గురించి పెద్దగా ఆలోచించ వలసిన అవసరం లేదని ఈ మధ్య రాజమౌళి తనను కలిసిన వారితో అన్నట్లు టాక్.  


అంతేకాదు ఈ మూవీ విడుదల అయిన తరువాత ఈ మూవీని చూసిన వారంతా సినిమా తాను  ఎందుకు జూనియర్ గెటప్ కు ఆ టోపీని వాడానో అర్ధం చేసుంటారని కూడ రాజమౌళి అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. దీనితో రాజమౌళి కావాలనే గతంలో బాహుబలి కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అన్న రీతిలో ఎన్టీఆర్ గెటప్ ను వాడుకోవాలని చూస్తున్నాడని జక్కన్న తెలివి తేటల పై ప్రశంసలు కురిపిస్తూ రాజమౌళి మార్కెటింగ్ తెలివి తేటలకు మురిసిపోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: