ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ.. అటు తమిళ చిత్ర పరిశ్రమలోనూ కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్న నటుడు లారెన్స్. నేడు నటుడు కమ్ కొరియోగ్రాఫర్ కమ్ దర్శకుడు రాఘవ లారెన్స్ పుట్టిన రోజు. జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించి కిందిస్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి లారెన్స్. ఆయన డ్యాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు. ఇలా అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు.

అంతేకాదు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు లారెన్స్. స్వతహాగా రాఘవేంద్ర స్వామి భక్తుడైన లారెన్స్ ఆయన పేరుకు ముందు రాఘవ అని చేర్చుకున్నారు. అలాగే తిరుమల్లైవయల్ అనే ప్రాంతంలో రాఘవేంద్ర స్వామి బృందావనం ఆలయాన్ని నిర్మించాడు ఆయన. లారెన్స్ మొదట తమిళ ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ కి కార్ క్లీనర్ గా పని చేసేవారు. డాన్సుల్లో లారెన్స్ ప్రతిభ గుర్తించిన రజినీకాంత్ డాన్సర్స్ యూనియన్ లో చేరటానికి సహాయం చేసారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి  'హిట్లర్' లో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చారు. ఆతరవాత చాలా కాలం కొరియోగ్రాఫర్ గా రాణించాడు లారెన్స్ . ఇక నటుడిగాను తన ప్రతిభను చాటుకున్నాడు.

ఇక లారెన్స్ ముని సినిమా తరువాత వరసగా అదే జానర్లో సినిమాలు చేస్తున్నాడు. అదే జానర్ అని చెప్పేకంటే.. ముని సీరీస్ ను కంటిన్యూ చేస్తున్నాడు లారెన్స్. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇదే ప్రాంచైజీలో లారెన్స్ ఇంకొన్ని సినిమాలు చేయనున్నాడు లారెన్స్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా కాంచన సినిమాను హిందీలో లక్ష్మీ బాంబ్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి సినిమాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు రాఘవ లారెన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: