ఒక్క తెలుగు ఆడియన్స్ మాత్రమే కాక దేశ విదేశాల సినీ అభిమానులు అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. సినీ దిగ్గజం దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసిన మొదటి రోజు నుండే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి అయితే ప్రతి రాజమౌళి సినిమాలాగే ఈ సినిమా కూడా లేట్ అవుతుంది ఈ సినిమాకి అదనంగా కరోనా ఎఫెక్ట్ పడడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.


అయితే  జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ యొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్ స్ సౌత్ లో చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. అలానే యూట్యూబ్లో కూడా రికార్డు సంఖ్యలో వ్యూస్ తెచ్చి పెట్టాయి. జూనియర్ ఎన్టీఆర్, చరణ్ టీజర్ కోసం అన్ని భాషలలో తన వాయిస్ ఇచ్చాడని తెలిసింది. చరణ్ కూడా ఎన్టీఆర్ తీజర్ కోసం తన వాయిస్ అన్ని బాషలలో ఇచ్చారు. ఇక ఈ సినిమా అన్ని ప్రధాన భారతీయ భాషలలో విడుదల కానుంది. దీని కోసం రాజమౌళి ఇప్పటికే అన్నీ అనౌన్స్ చేశారు. 


అయితే బాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అంతగా తెలియని ముఖాలు కావడంతో  రాజమౌళి ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ కి మరింత ఊపు తీసుకు రావాలనికుంటున్నారు. కాబట్టి, ఈ యాక్షన్ థ్రిల్లర్ యొక్క హిందీ వెర్షన్ కోసం వాయిస్ ఓవర్ అందించడానికి అతను బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ను సంప్రదించాడని అంటున్నారు. అమీర్ ఖాన్ రాజమౌళి అడగగానే ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ కోసం తన గొంతును ఇవ్వడానికి అంగీకరించినట్టు చెబుతున్నారు. అమీర్ ఇప్పుడు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాడు మరియు తన వాయిస్ ఓవర్ ద్వారా చిత్రంలోని కొన్ని ముఖ్య అంశాలను కూడా వివరించనున్నాడు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: