ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..... యస్ యస్  రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'ఛత్రపతి' సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే. 2005 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌ని మలుపుతిప్పిన చిత్రంగా నిలిచింది. టాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ సాధించి కాసుల వర్షం కురిపించింది.ఆ సినిమాలో ప్రభాస్ కట్ ఔట్ యాక్టింగ్ అయితే ఒక రేంజ్ లో ఉంటాయి. అయితే ఇన్నేళ్లకు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. అంతేకాదు ఈ పవర్‌ఫుల్ సినిమాతో తెలుగు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్.


ఇక ఈ రీమేక్ ని ఫస్ట్ సాహో సినిమా తీసిన సుజీత్ దర్శకత్వం చేస్తాడని రూమర్స్ వచ్చాయి. కాని తరువాత అతను తప్పుకున్నాడని తెలియడంతో వివి వినాయక్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడట. నిజానికి బెల్లం కొండని ఇండస్ట్రీ కి మొదట పరిచయం చేసింది వినాయక్ కావటం తో బెల్లం కొండా చాలా హ్యాపీగా వున్నాడట. ఇక ఒరిజినల్ సినిమా చూసుకున్నట్లయితే ఛత్రపతిలో ప్రభాస్ యాక్టింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా కథ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రభాస్సినిమా కథకి బాగా సెట్ అయ్యాడు. కాని బెల్లం కొండా అంత పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయగలడా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకేవేళ చేసిన ప్రభాస్ అంత గొప్పగా యాక్టింగ్ చేయగలడా అని సోషల్ మీడియా లో కామెంట్స్ వస్తున్నాయి. బాగా ట్రోల్ల్స్ కూడా వస్తున్నాయి. కాని ఏది ఏమైనా కాని సినిమా విడుదల అయితే కాని చెప్పలేము. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...



మరింత సమాచారం తెలుసుకోండి: