ఏదైనా సినిమాకు హైప్ క్రియేట్ అవ్వాలంటే పబ్లిసిటీను బాగా ప్లాన్ చేయాలి. ఎంతబాగా ప్రమోషన్ చేస్తే అంత బాగా ఆ సినిమా అనేది ఆడియెన్స్ కు రీచ్ అవుతుంది. అందుకే, ప్రీ రిలీజ్ వేడుకలకు ఎక్కువ మొత్తంలో ఖర్చుపెట్టడం జరుగుతుంది. ఆడియో ఫంక్షన్స్ తో పాటు సక్సెస్ మీట్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అలాగే వేడుకకు విచ్చేసిన అతిథులు కూడా సినిమా గురించి మాట్లాడటం జరుగుతుంది. ఎనర్జటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ "రెడ్"కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అంగరంగవైభవంగా జరిగింది. ఐతే, ఎవరూ ఊహించని ట్విస్ట్ మాత్రం ఈ ఈవెంట్ లో చోటుచేసుకుంది. అదేంటో, ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో త్రివిక్రమ్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది. కానీ, ఈ వేడుకలో ఓ మిస్టేక్ అనేది ఫిలిం యూనిట్ ను కంగారుపెట్టింది. ఈ వేడుక చివర్లో హీరో రామ్ తో పాటు టీం ఈ మూవీకి సంబంధించిన పెద్ద టికెట్ ను గెస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అందించారు. ఆ టికెట్ ను ఓపెన్ చేయగానే అందరికీ షాక్ ను కలిగించే విషయం బయటపడింది. రెడ్ మూవీ బదులు క్రాక్ మూవీ బిగ్ టికెట్ ను త్రివిక్రమ్ కు అందచేశారు. ఇంతా చేసి క్రాక్ మూవీకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్లయింది అనంటున్నారు విశ్లేషకులు.

జరిగిన మిస్టేక్ ను వెంటనే అర్థం చేసుకున్న రామ్, 'క్రాక్' అనే పేరుపై "రెడ్" అన్న స్టిక్కర్ ను అతికించాడు. ఐతే, రిలీజ్ డేట్ మాత్రం మార్చలేకపోయారు. ఈ మిస్టేక్ పై అనేక ట్రోల్స్ వచ్చాయి. తప్పులు సహజమేనంటూ రామ్ సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు.

ఈ ఇన్సిడెంట్ తో ప్రీ రిలీజ్ వేడుకలకు ఇంత ఖర్చుపెట్టడం అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ అంటూ ఈ విషయాన్ని కూడా పాజిటివ్ గా తీసుకుంటున్నారు రెడ్ టీమ్ కి చెందిన సభ్యులు. రెడ్ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: