సాయి పల్లవి అంటేనే కుర్రకారులో ఓ క్రేజ్.. అందానికి అందం.. నటన, డ్యాన్స్ అన్నీ కలగలపిన అపురూప నటి సాయి పల్లలి.. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోదు. సెలెక్టెడ్‌ మూవీస్ చేస్తూ తనకంటూ ఓ స్థాయి ఏర్పాటు చేసుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న లవ్‌స్టోరీ విడుదలకు సిద్ధమైంది. గతంలో శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఫిదా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.


ఫిదా సినిమాలోని వచ్చిండే.. పాట కూడా అదరగొట్టేసింది.. ఓ ఏడాది పాటు ఎక్కడ చూసినా అదే పాట. ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్ రిపీటైనట్టే అనిపిస్తోంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌ స్టోరి’ చిత్రంలోని ‘సారంగ దరియా’ పాట ఆదివారం సమంత చేతుల మీదుగా విడుదలైంది.  సంగీత దర్శకుడు పవన్‌ సీహెచ్‌ ఫోక్‌ బీట్‌ అందించిన ఈ పాటకు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించారు. మంగ్లీ ఆలపించారు.


ఈ పాట అలా విడుదలయ్యిందో లేదో అప్పుడే రికార్డులు మొదలు పెట్టింది..24 గంటలు కూడా కాకుండానే 5 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. వినగానే గుర్తుండిపోయే ట్యూన్.. ఊపునిచ్చే మంగ్లీ గాత్రం.. అదరగొట్టిన సాయిపల్లవి నృత్యం.. మొత్తానికి ఈ పాట మరో బ్లాక్ బ్లస్టర్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘తెలంగాణ జానపద గీతం ‘సారంగ దరియా’కి సరికొత్త సొగసులు అద్ది, తనదైన ముద్రతో సుద్దాల అశోక్‌తేజ చక్కని సాహిత్యం అందించామన్నారు.


ఈ జానపద బీట్‌కు మంగ్లీ లాంటి సింగర్‌ వాయిస్‌, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ కలిస్తే తెరపై ఇక సందడే సందడి అన్న సంగతి చెప్పాల్సిన పని లేదు. దీనికి తోడు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం మరోసారి మెరిసింది. కె నారాయణదాస్‌ నారంగ్‌, పి.రామ్మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లవ్‌ స్టోరీ చిత్రం ఏప్రిల్‌ 16న విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: