తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ గురించి తెలియని వారు ఉండరేమో అనడంలో అతిశయోక్తి లేదు. సినీ ప్రియులతో పాటు మేకర్స్‌కు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఆర్‌ఎఫ్‌సీ. ఇక్కడకు ఇండియా ఫిల్మ్ మేకర్స్ మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా పలువురు సినిమా మేకర్స్ షూటింగ్ నిమిత్తం వస్తు ఉంటారు. ఇది షూటింగ్స్‌కు అనువైన ప్రదేశం కాగా, దీనిని రామోజీరావు నిర్మించిన సంగతి అందరికీ విదితమే. కాగా, త్వరలో మరో మిని ఆర్ఎఫ్‌సీ రాబోతుందట. తెలుసా? అదెక్కడ ఉండబోతుందంటే..


విభజిత ఏపీలోని వైజాగ్ వేదికగా మినీ రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజెంట్ స్మార్ట్ సిటీగా ఉన్న వైజాగ్ త్వరలో ఇంకా అభివృద్ధి చెందుతోంది. కాగా, విశాఖ పరిసరాల్లోనే సరికొత్త టాలీవుడ్ నిర్మాణానికి ఏపీ సర్కారు సన్నాహకాల్లో  ఉంది. ఇందుకు సంబంధించి సినీ ప్రముఖులతో భేటీ కూడా అయ్యారు ఒకసారి. ఈ క్రమంలోనే ప్రకృతి సోయగాలకు నెలవైన వైజాగ్ ఇక సినిమా వారికి ఇంకా ఇష్టమైన ప్లేస్ కానుంది. షూటింగ్స్‌కు సంబంధించిన ప్రదేశాలు డెవలప్ చేసేందుకు గాను, భారీగా పెట్టుబడుల్ని సమకూర్చేందుకు గాను జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అక్కడ బీచ్ ప్రాంతంలో బీచ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్టూడియోలు కట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న రామానాయుడు, అన్నపూర్ణ, సారథి, శబ్దాలయ స్టూడియోలు కొన్ని ఏళ్లుగా షూటింగ్స్‌కు కేరాఫ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, స్టూడియోల్లో షూటింగ్స్ అనుకూలమైనప్పటికీ ఎక్కువ శాతం రికార్డింగ్స్‌కే ఇవి బాగుంటాయి. ఇటీవల కాలంలో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అరకు ఇతర నేచురల్ ప్లేసెస్‌లో పలు సినిమాల చిత్రీకరణలు జరిగాయి. ఇక షూటింగ్‌లు ఇంకా ఎక్కువ మొత్తంలో జరపాలని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే పలువురు దర్శకులను కోరారు. వైజాగ్ మరో కేరళ అని ఇప్పిటకే పలువురు స్థానికులు పేర్కొంటుడటం విశేషం. ఈ ప్రాంతాల్లో షూటింగ్స్‌కు స్థానిక తెలుగు భాష చిత్రాలతో పాటు ఇతర భాషా చిత్రాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వైజాగ్‌లో మరో మినీ రామోజీ ఫిల్మ్ సిటీ రావడం మంచిదేనని స్థానికులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: