మెగాస్టార్ చిరంజీవి మొదట సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ , ఆ తర్వాత మెగా స్టార్ గా ఎదిగాడు. సినీ ఇండస్ట్రీలో పట్టుదలతో , స్వయం కృషితో అత్యున్నత స్థాయికి ఎదిగిన మెగాస్టార్ హీరో కూడా మోసపోయాడు అంటే ఎవరూ నమ్మరేమో. అయితే ఇది నిజం అండి, ఒక ప్రాణస్నేహితుడు వల్ల మోస పోయాడట. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

ఇక చిరంజీవి మోసం చేసిన వ్యక్తి ఎవరో కాదు"హరి ప్రసాద్" చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఫిలిం  ఇన్స్టిట్యూట్లో తను నటునను, డాన్సులను అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు. ఇక అక్కడే శుభలేఖ సుధాకర్, మరొక నటుడు హరిశ్చంద్రప్రసాద్ కూడా బాగా కలిసి ఉండేవారు. వీరందరూ కలిసి  నరసాపురం లో ఒక అద్దె ఇంట్లో ఉండేవారు.

ఇక మొట్టమొదటిసారిగా శుభలేఖ సుధాకర్ కి తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది.. కానీ ఆ డైరెక్టర్లు ఒక కండిషన్ పెట్టారు.. అదేమిటంటే ఈ సినిమా చేసేటప్పుడు వేరే సినిమాల్లో నటించకూడదని, కానీ అంతకుముందే పునాదిరాళ్లు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు సుధాకర్. ఆ తమిళ సినిమాను చిరంజీవికి ఇచ్చేశాడు సుధాకర్. ఇక అసలు విషయానికొస్తే, వీరందరూ బాగా కలిసి ఉన్నప్పుడు, హరి ప్రసాద్ ఒక మూవీ విషయంలో వీరిరువురికీ తెలియకుండా ఓ సినిమాలో హీరో గా నటించేందుకు సినిమాకి ఓకే చేశాడు.

ఈ విషయాన్ని వీరిద్దరూ ఎప్పుడు నవ్వుతూనే చెప్పేవారు. ఇక శివరంజని సినిమా లో హీరో కోసం ఆ యూనిట్ సభ్యులు వెతుకుతూ ఉండగా.. వీరందరికీ ఒకేసారి పిలుపు వచ్చింది. కానీ  అక్కడ హరిప్రసాద్ తన తెలివిని ఉపయోగించి, చిరంజీవి , సుధాకర్ వారిరువురు ఇక్కడ ఊర్లో లేరు అని చెప్పి. ఆ సినిమాలోని ఛాన్స్ సంపాదించాడు. ఈ విధంగా వారిరువురిని తెలియకుండా హరి ప్రసాద్ మోసం చేశాడని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: