కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తెలుగులో కూడా సూపర్ పాపులర్ అయ్యాడు. అంతకుముందు కేవలం తమిళ సినిమాలతోనే తెలుగు ఆడియెన్స్ కు దగ్గరగైన విజయ్ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమాలో చిన్న పాత్ర చేసిన విజయ్ సేతుపతి ఈ ఇయర్ మొదట్లో వచ్చిన ఉప్పెన మూవీలో శేషారాయణం పాత్రలో అదరగొట్టారు విజయ్ సేతుపతి.

ఉప్పెన మూవీ హిట్ అవడంలో విజయ్ సేతుపతి కూడా ఒక మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. ఉప్పెన ఫిల్మ్ లో శేషారాయణం పాత్రలో విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అందుకే విలన్ గా విలక్షణ పాత్రకు విజయ్ సేతుపతిని అడుగుతున్నారు. లేటెస్ట్ గా విజయ్ సేతుపతి మరో తెలుగు సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. సందీప్ కిషన్ హీరోగా భరత్ చౌదరి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తాడని టాక్.

ఈ సినిమాను ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే సమర్పిస్తుండగా రంజిత్ నిర్మిస్తున్నారు. యువ హీరో సందీప్ కిషన్ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం విజయ్ సేతుపతితో సందీప్ కిషన్ సినిమాకు మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. యువ హీరోల్లో కెరియర్ పరంగా వెనకపడ్డ సందీప్ కిష ఈసారి పర్ఫెక్ట్ హిట్ సబ్జెక్ట్ తో వస్తున్నాడని అంటున్నారు. అందుకే పాత్ర ప్రాధాన్యతని బట్టి విజయ్ సేతుపతి లాంతి నటుడు ఉంటే సినిమాకు అదనపు ఆకర్షణ అని అతన్ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సందీప్ కిషన్ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని టాక్. విలనిజం కే కొత్త క్రేజ్ తెచ్చేలా మక్కల్ సెల్వన్ నటన అదరగొడుతుందని మాత్రం చెప్పొచ్చు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: