హ్యాపీ డేస్ సినిమా తో ఆహా అనిపించి, కొత్త బంగారులోకం సినిమా తో ప్రేమలో కొత్తదనాన్ని చూపించిన ప్రముఖ హీరోగా గుర్తింపు పొందాడు వరుణ్ సందేశ్.. సినీ ఇండస్ట్రీలోకి సోలోగా అడుగుపెట్టి, నటనలో ప్రావీణ్యం పొంది తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఈయనకు అవకాశాలు రాకపోవడంతో ఇక పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో ద్వారా మళ్ళీ తెరపైకి వచ్చారు.


ఒడిశాలోని రాయగడ లో 1989 ఇది జూలై 21వ తేదీన జన్మించారు. ఒడిస్సా లో స్థిరపడ్డ తెలుగు కుటుంబం.. ఈయన తండ్రి ఐటీ ఉద్యోగి కావడంతో ఉద్యోగరీత్యా హైదరాబాద్ కు వచ్చేసారు. ఇక్కడ నాలుగు సంవత్సరాలు గడిపి, ఆ తర్వాత వరుణ్ సందేశ్ కుటుంబం అమెరికాకు వెళ్లి పోయింది. విద్యాభ్యాసం మొత్తం అమెరికాలోని న్యూజెర్సీలో ముగిసింది. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో సినిమా అవకాశాలు రావడంతో చదువును మధ్యలోనే ఆపేశాడు. ఇక అంతే కాదు అప్పట్లో వచ్చిన అందం సీరియల్ లో వరుణ్ సందేశ్ నటించాడు. ఆ తర్వాత యండమూరి దర్శకత్వంలో వచ్చిన ప్రియురాలు పిలిచింది సీరియల్ లో కూడా నటించాడు.

అయితే హ్యాపీ డేస్ సినిమా కోసం నటీనటులను వెతుకుతున్న నేపథ్యంలో, శేఖర్ కమ్ముల న్యూస్ యాడ్ ఇవ్వడంతో, అది చూసి వరుణ్ సందేశ్ హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ లో పాల్గొనడం  జరిగింది. శేఖర్ కమ్ములకు వరుణ్ బాడీ లాంగ్వేజ్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. ఇక హ్యాపీడేస్ సినిమా విజయవంతం కావడంతో అమ్మాయిల గుండెల్లో రాకుమారుడిలా నిలిచిపోయాడు. కొత్త బంగారులోకం సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్, ఆ తర్వాత సినిమా కథలను ఎంచుకోవడం లో మిస్టేక్ చేయడంతో దాదాపు 30 సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి.


ఇక ఆగస్టు - 19 - 2016 సంవత్సరం లో ప్రముఖ హీరోయిన్ వితికా  షేర్ ను వివాహం చేసుకున్నాడు. పడ్డానండి ప్రేమలో మరీ సినిమాలో నటించిన వీరిద్దరూ.. ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది.. అయితే ఆ తర్వాత ఎన్ని సినిమాలు నటించినా గుర్తింపు రాని వరుణ్ సందేశ్ సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది.. అయితే ఇటీవల రీసెంట్ గా ఇందువదన సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. ఇది కూడా రొమాంటిక్ అండ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతోంది.. ఇటీవల ట్రైలర్ విడుదల అయ్యి, మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో వేచిచూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: