తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఒక్కవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు రాజకీయ రణగంలోను రాణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమకి కొంత విరామం తీసుకోని వకీల్ సాబ్ సినిమాతో ఇండస్ట్రీకి రి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా రాణిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమలో నటిస్తున్నారు. ఈ సినిమాను పవన్, రానా మల్టీ స్టారర్ చిత్రంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు.

ఇక ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తి  చేసుకోగా.. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శక పర్యవేక్షణ  చేపట్టారు. అయితే సాధారణంగా ఏ సినిమా అయినా రెండు మూడు రోజులు సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీ షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా మాత్రం ఏకంగా 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత సినిమా అవుట్ పుట్ చూసిన పవన్ కళ్యాణ్ చాలా మార్పులు చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ సినిమా తిరిగి 40 రోజుల పాటు రీ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలిపాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఇక దగ్గుబాటి రానా ఇందులో శేఖర్ పాత్రలో సందడి చేయనున్నట్లు తెలిపాడు. కాగా.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: