ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి హిందీ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కంగనా రనౌత్ టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరో లలో ఒకరైన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'ఏక్ నిరంజన్' మూవీ లో హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ కి  డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.  

'ఏక్ నిరంజన్' సినిమా  బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించక పోయినప్పటికీ కంగనా రనౌత్ కు మాత్రం తెలుగు సినీ ప్రేమికుల  నుండి మంచి ప్రశంసలు దక్కాయి.  ఇలా 'ఏక్ నిరంజన్' సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోయిన్ గా తన కెరియర్ ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న కంగనా రనౌత్ తాజాగా  'ధాకడ్' మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది.

సినిమా మే 20 వ తేదీ న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్  లలో పాల్గొన్న కంగనా రనౌత్ కు మీరు నిజ జీవితం లోనూ మగరాయుడు లాగానే ఉంటారా అనే ప్రశ్న  ఎదురైంది.  ఈ ప్రశ్నకు బాలీవుడ్ బ్యూటీ  కంగనా రనౌత్ సమాధానమిస్తూ... ఇలాంటి పుకార్లు పుట్టించడం వల్లనే నాకు ఇప్పటికి పెళ్లి కావడం లేదు.   ఊరికే నేను అందరితో ఫైట్ చేస్తాను అని అనుకుంటున్నారు,  కానీ ఎవరినీ నేను కొడుతున్నాను... చెప్పండి... అని కంగనా రనౌత్ తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. కంగనా రనౌత్ 'ధాకడ్' మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: