ఆకాష్ పూరీ.. గెహన సీప్పి జంటగా నటిస్తున్న చిత్రం చోర్ బజార్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నటి రోజు హైదరాబాద్ లో చాలా ఘనంగా జరుపుకున్నారు. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలో బండ్ల గణేష్ చేయడం వల్ల మంచి స్నేహ బంధం ఉన్నది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బండ్లగణేష్ రావడం జరిగింది. ఈ వేదికపై బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మా వదిన లావణ్య అని తెలియజేశారు. తను నాకు అమ్మ ,అక్క , వదినతో సమానం అని తెలియజేశారు.


నా తల్లి తర్వాత నేను గౌరవించే వ్యక్తి ఈమె అని తెలియజేశారు బండ్లగణేష్. ఇక అంతే కాకుండా ఎన్నో ర్యాంపులు వ్యాంపు లు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. అమ్మ ఎప్పటికీ అలానే ఉంటుంది అని తెలిపారు. జీవితాంతం ఆమెను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆకాష్ , పవిత్ర.. పూరీ  లదే.. అన్నది తెలియజేశారు. పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత ఎంతో మంది వచ్చారు. కానీ ముందుగా మాత్రం వచ్చింది ఈ మహాతల్లి నే అంటూ తెలియజేశారు.


డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎంతోమందిని స్టార్ లను  చేశారు.  సూపర్ స్టార్ లుగా చేశారు. డైలాగులు రాని వారి చేత కూడా డైలాగులు నేర్పించాడు. అదే నా కొడుకు సినిమా అంటే నేను లండన్లో ఉన్న కూడా వచ్చేవాడిని కానీ ఇక్కడికి పూరి జగన్నాథ్ ఎందుకు రాలేదో తెలియదు .. బిజీగా ఉన్నాడో తెలియదు అని తెలుపుతూ వచ్చాడు బండ్ల గణేష్. అన్న ఇలాంటి పని మాత్రం ఎప్పుడూ చేయకు నీకు దండం పెడతాను ఎందుచేత అంటే మనం  ఆస్తులు సంపాదిస్తుంది కేవలం మన కుటుంబం కోసమే కదా అని తెలిపారు. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుంది. నువ్వు నీ కొడుకు ని స్టార్  చేయకపోయినా స్టార్ హీరో అవుతాడు నువ్వు కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో నిలబడే రోజు వస్తుంది అని బండ్ల గణేష్ తెలియజేశారు. అప్పుడు ఆకాష్ డేట్స్ ఇవ్వకుండా నేను చూస్తాను అని తెలిపారు బండ్లగణేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: