సినిమా పరిశ్రమంలో అయినా దర్శకులు ట్రెండుకు తగ్గట్లుగా వ్యవహరిస్తూ ముందుకు పోవాలి. అప్పుడే వారికి మంచి హిట్స్ తో పాటు గొప్ప పేరు కూడా వస్తుంది. ఆ విధంగా టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్న రాజమౌళి ఎప్పటికప్పుడు తన సినిమాలను తరికెక్కించే స్టైల్ మార్చుకుంటూ వెళుతూ ఇంతటి ఘన విజయాలను అందుకున్నారు. ఆయన ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా కూడా ఘనవిజయం సాధించింది అంటే ఆయన చేసిన ట్రెండ్ కు తగ్గ సినిమాలు చేసిన విధానమే కారణం అని చెప్పాలి.

తాజాగా ఆయన చేసిన భారీ మల్టీ స్టార్లర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ ఘన విజయం సాధించి హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ఆయన కీర్తి నీ పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క ప్రతిభ తెలుస్తోంది. ఇకపై రాబోయే సినిమాలతో ఆయన హాలీవుడ్ దర్శకుల సరసన నిలవపోవడం ఖాయం అని చెప్పాలి. అయితే హాలీవుడ్ మేకర్స్ చూపు ఈ దర్శకుడు పై పడింది కాబట్టి ఇప్పటివరకు ఆయన చేసిన తెలుగు సినిమా కమర్షియాలిటీ అంశాలను కాకుండా హాలీవుడ్ ప్రేక్షకులకు కూడా నచ్చే అంశాలను కూడా తన సినిమాలో పొందుపరచాలని కొంతమంది సినిమా నిపుణులు సూచిస్తున్నారు. 

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎంత లేదన్న తెలుగు ప్రేక్షకుల కు నచ్చే అంశాలు పెట్టారు. నార్త్ ప్రేక్షకులకు అవి కొంత నచ్చలేదు కాబట్టి హాలీవుడ్ స్థాయిలో వెళుతున్నప్పుడు అలాంటి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే రాజమౌళి హాలీవుడ్ దర్శకుల మన్నన పొందడం గ్యారెంటీ అని చెప్పాలి. ఇకపోతే రాజమౌళి తన తదుపరి సినిమా ను మహేష్ బాబు తో చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది. అదే ఏడాదిలో సినిమా విడుదల చేయడనికి ప్రయత్నాలు చేస్తురట.

మరింత సమాచారం తెలుసుకోండి: