ఇక అదృష్టం అనేది అని సార్లు కూడా కలిసి రాదు.. మొదట్లో సక్సెస్ లు ఎక్కువగా పలకరించినా ఆ తర్వాత ఫ్లాప్ లు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇక వాటిని కూడా తట్టుకోవాలి. ప్రస్తుతం ఇక ఇదే స్టేజ్ లో ఉంది అందాల భామ కృతి శెట్టి.ఉప్పెన సినిమాతో డైరెక్ట్ గా కుర్రకారు గుండెల్లోకి దూకేసింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఉప్పెన సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి ఓవర్ నైట్ భారీ క్రేజ్ వచ్చేసింది. దాంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాగా బిజీ అయిపోయింది ఈ చిన్నది. ఉప్పెన సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకులను కృతి పలకరించింది. ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇంకా అలాగే నాగచైతన్య కు జోడీగా నటించిన బంగార్రాజు సినిమా కూడా మంచి సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ భామ టాలీవుడ్ కి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ చిన్నదానికి ఊహించని షాక్ ఇచ్చింది మాత్రం ఇటీవల వచ్చిన రామ్ పోతినేని సినిమా.


ఎనర్జిటిక్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన ది వారియర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది కృతిశెట్టి.తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ వారియర్ సినిమా డిజాస్టర్ అవవడంతో ఈ అమ్మడు నితిన్ సినిమా పై ఆశలు పెట్టుకుంది.ఇంకా అలాగే నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం సినిమాలో నటించి కృతి. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యి బోల్తా కొట్టింది. దాంతో కృతికి బ్యాక్ టు బ్యాక్ భారీ ఫ్లాప్స్ వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఈ అమ్మడు ఆశాలన్ని కూడా సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా పైనే వున్నాయి.సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పై ఇప్పటిదాకా ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. ఇక మరి ఈ సినిమా అయినా కృతి ని ఆశాలను నిలబెడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: