పవన్ కళ్యాణ్ కు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతటి స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్ప టికే ప్రేక్షకులను వెర్రెక్కించే సినిమాలను చేసి నెంబర్ వన్ హీరోగా ఎదిగిపోయారు పవన్. రాజకీయాలలో కూడా తన సత్తా చాటాలని అక్కడ గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పోయిన ఎన్నికలలో ఓడిపోవడంతో మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల నాటికి మరిన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను తన అభిమానులను అలరించాలని ఆయన ఆలోచన.

ఆ విధంగానే ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఇప్పుడు మరికొన్ని సినిమాలతో వారిని అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మరి కొన్ని రోజులలోనే హరిహర వీరమల్లు సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ఆయన సన్నాహాలు చేశాడు ఈ చిత్రాన్ని 50 రోజుల లో పూర్తి చేయడానికి షెడ్యూల్ రెడీ చేయగా తొందర్లోనే పవన్ కళ్యాణ్సినిమా యొక్క షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలను కూడా ఆయన చేయడానికి సిద్ధమయ్యాడు. 

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధి గా రాబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న నేపథ్యంలో మెగా అభిమానులు దీని పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. చాలా రోజుల తర్వాత తమ అభిమానుల హీరోలను ఇద్దరిని ఒకే వేదికపై చూడబోతున్నామన్న సంతోషం వారిలో కనపడింది. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ కి ఫంక్షన్కు రావడం లేదని కూడా కొంతమంది చెబుతున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్సినిమా ఈవెంట్ కు వస్తాడా లేదా అన్న అయోమయం మెగా అభిమానులలో నెలకొంది. దీనిపై తొందరగా చిత్ర బృందం ఒక క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: