చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చియాన్ విక్రమ్ తాజాగా కోబ్రా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా ,  శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయింది.

కాక పోతే ఈ సినిమా లెంత్ మరీ ఎక్కువగా ఉండడం ఏ సినిమాకు కాస్త నెగిటివ్ గా మారింది. దానితో చిత్ర బృందం ఆ తర్వాత ఈ సినిమా నిడివిని కూడా కాస్త తగ్గించారు. ఏది ఏమైనప్పటికీ చివరగా ఈ సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సాధించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయిన కోబ్రా మూవీ మరి కొన్ని రోజుల్లోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏ సినిమా సోనీ లివ్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయింది.

సెప్టెంబర్ 28 వ తేదీ నుండి డిజిటల్ కోబ్రా మూవీ ని సోనీ లివ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది. మరి థియేటర్ లాలి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన కోబ్రా మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే చేయండి విక్రమ్ తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: