మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న విషయం మన అందరికి తెలిసిందే..అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ప్రమోషనల్ కంటెంట్ ద్వారా మంచి అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకోబోతుందో చూడాలి..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ అమెరికా లో ప్రారంభం అయిపోయాయి..అమెరికాలో ఈ సినిమాని సుమారు 450 కి పైగా లొకేషన్స్ లో విడుదల చేస్తున్నారు..రీమేక్ సినిమా అయ్యినప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి క్రేజ్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే జరిగాయి..చాలా లొకేషన్స్ లో ఉన్న షోస్ కి ఆలస్యం గా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించినప్పటికీ కూడా టికెట్స్ నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయట...


ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ నుండి 5 లక్షల డొల్లర్లుయి వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది..మెగాస్టార్ చిరంజీవి గారి రేంజ్ కి ఇది తక్కువే అయ్యినప్పటికీ కూడా వారం మధ్యలో..అది ఒక కూడా ఒక రీమేక్ సినిమాకి ఇంత మొత్తం వచ్చిందంటే చాలా గ్రేట్ అనే చెప్పవచ్చు.


ఇక ఈ ప్రీమియర్ షోస్ నుండి ఈ సినిమాకి వస్తున్నా టాక్ కూడా అదిరిపోయిందట...చిరంజీవి ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడని..ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం అభిమానులను విపరీతంగా సంతృప్తి పరిచిందని చెప్పుకొస్తున్నారు..ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో నటించిన విషయం మన అందరికి తెలిసిందే..సల్మాన్ ఖాన్ కి మరియు చిరంజీవి కి మధ్యన వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా అదిరిపోయాయట..


ఇక ఈ చిత్రం పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయినట్టు సమాచారం..భీమ్లా నాయక్ గెటప్ లో పవన్ కళ్యాణ్ నందికొట్కూరు సబ్ జైలు లో బ్రహ్మ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి ని కలిసే విధంగా డైరెక్టర్ మోహన్ రాజా ఒక చిన్న క్రాస్ ఓవర్ చేసినట్టు తెలుస్తుంది..


మొత్తానికి అమెరికా నుండి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం తో మెగా ఫాన్స్ లో కూడా మాములు ఉత్సాహం లేదు..ఎందుకంటే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఈ సినిమా మిగిలించిన నిరాశ నుండి మెగా అభిమానులు ఎప్పుడు కోలుకుంటారో అని అనుకుంటున్న సమయం లో వాళ్లలో గాడ్ ఫాదర్ చిత్రం మంచి ఊపుని నింపిందట  ..ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా ఏ రేంజ్ కి చేరుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: