అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన రకుల్ ప్రీతిసింగ్ అటు తెలుగు, తమిళ్, హిందీ ,కన్నడ వంటి భాషలలో పలు చిత్రాలలో నటించింది. టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించిన రకుల్ ప్రీతిసింగ్ ఈమధ్య అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ వైపే ఎంట్రీ ఇచ్చి అక్కడే సెటిల్ అయ్యింది. హీరోయిన్ గా జెట్ స్పీడ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ ప్రముఖ నిర్మాత అయిన జాకీ భగ్ననిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది.


పెళ్లయినప్పటికీ కూడా ఈ ముద్దు గుమ్మ అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఇక బాలీవుడ్ లో అయితే దేదే ప్యార్ దే 2 , ఇండియన్ 3 తదితర చిత్రాలను నటిస్తూ ఉన్నది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీతిసింగ్ కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేసింది.. రకుల్ మాట్లాడుతూ తాను హీరోయిన్గా వెండితెరపై కనిపించాలని ఆశతో తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను.. కానీ హీరోయిన్లకు కూడా పరిమిత కాలం ఉంటుందని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపింది.


మనం అద్భుతంగా పనిచేసే రోజులివి వయసుతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో రాణించవచ్చు.. అందుకే తన వృత్తిలో తాను రోజు కూడా ఉత్తమంగా ఉండకపోయినా పరవాలేదు..అభిమానులలో చిన్నపిల్లలు కూడా ఉంటారు. అందుకే కథల ఎంపిక విషయంలో తాను ఆచితూచి అడుగులు వేయవలసిన బాధ్యత కూడా ఉన్నది.. ఈ విషయంపై అందరి నటీనటుల పైన కూడా బాధ్యత ఉంటుంది అంటూ తెలియజేసింది. మొత్తానికి ఇండస్ట్రీలో కొనసాగించాలి అంటే వయసుతో సంబంధం లేదనే విషయాన్ని రకుల్ ప్రీతిసింగ్ చెప్పడంతో హాట్ టాపిక్ గా మారుతున్నది. మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: