ఆయన ఓ ప్రముఖ ప్రొడ్యూసర్.. కానీ ఆయన అల్లు అర్జున్ సినిమాలో నటించినందుకు ఆయన భార్య నోటితో తిట్టు తిన్నారట.మరి ఇంతకీ అల్లు అర్జున్ సినిమాలో నటిస్తే ఆ ప్రొడ్యూసర్ ని ఎందుకు ఆయన భార్య తిట్టింది..అల్లు అర్జున్ అంటే ఈ ప్రొడ్యూసర్ భార్య కి నచ్చదా.. అంత పెద్ద స్టార్ హీరో సినిమాలో నటిస్తే ఎందుకు తిట్టింది అనే అనుమానాలు మీ అందరిలో రావచ్చు.మరి ఇంతకీ అల్లు అర్జున్ సినిమాలో నటించిన ఆ ప్రొడ్యూసర్ ఎవరు.. ఎందుకు భార్యతో తిట్లు తిన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ సినిమాలో నటించి భార్య చేతిలో తిట్లు తిన్న ప్రొడ్యూసర్ ఎవరో కాదు బన్నీ వాసు.. ఇదేంటి బన్నీ వాసుకి, అల్లు ఫ్యామిలీకి ఎంతో మంచి అనుబంధం ఉంది. 

అలాగే బన్నీ వాసు అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్స్.. అలాంటిది అల్లు అర్జున్ సినిమాలో నటిస్తే ఆయన భార్య ఎందుకు తిడుతుంది అనే  డౌట్  మీ అందరికీ రావచ్చు.అయితే ఇదంతా అల్లు అర్జున్ స్టార్ కాకముందు జరిగింది. ఇక సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమాలో ఓచోట బన్నీ వాసు, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్,దిల్ రాజు ఆఫీస్ అకౌంటెంట్ శ్రీధర్ లు కనిపిస్తారు. 
అయితే ఈ సినిమాలో నటించే సమయంలో ఓ ముగ్గురు అబ్బాయిలు అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న ఈ ముగ్గురితో సుకుమార్ చేయించారట. అయితే ఈ సినిమా విడుదలయ్యాక  బన్నీ వాసు భార్య చూసి ఇదేంటి మీరు సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారు.ఇంకోసారి సినిమా చేస్తే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చిందట. ఎందుకంటే ఆయన సినిమాల్లో నిర్మాతగానే రాణించాలి అని చెప్పిందట.అయితే ఈ విషయాన్ని బన్నీ వాసు నిర్మించిన తాజా మూవీ లిటిల్ హార్ట్స్ ప్రమోషన్స్ లో బయట పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: