శ్రీదేవి.. వందేళ్లు బతుకుతుంది అనుకున్న హీరోయిన్ అర్ధాంతరంగా 50 ఏళ్లకే తనువు చాలించింది... ఈ హీరోయిన్ కేవలం 54 ఏళ్ల వయసులోనే అనుమానాస్పస్థితిలో మరణించింది.దుబాయ్ కి పెళ్లి కోసం వెళ్లిన శ్రీదేవి తెల్లారేసరికి బాత్ టబ్ లో శవమై తేలడంతో చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు.ముఖ్యంగా శ్రీదేవి మరణించినప్పుడు బోనీ కపూర్ పై కూడా అనుమానపడ్డారు.శ్రీదేవి చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే బోనీ కపూర్ శ్రీదేవిని చంపేసారు అంటూ ఎన్నో రూమర్లు క్రియేట్ అయ్యాయి.ఇదంతా పక్కన పెడితే శ్రీదేవిది నాచురల్ డెత్ అని డాక్టర్లు తేల్చేశారు. ఇదంతా పక్కన పెడితే చాలా మందికి చివరి కోరిక అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే చనిపోతాం అనుకునే ముందు చివరి కోరికని బయటపెడతారు. 

అలా శ్రీదేవి కూడా బతికున్న సమయంలో తాను పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలలో నా చివరి కోరిక ఇదే అంటూ ఓ విషయాన్ని చెప్పింది.అదేంటంటే..శ్రీదేవికి వైట్ కలర్ అంటే చాలా ఇష్టమట. అందుకే శ్రీదేవి నటించిన ప్రతి సినిమాలో వైట్ డ్రెస్సులు, చీరలు వేసుకునేది.అలా శ్రీదేవికి తెలుపు రంగు మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఇక ఈ విషయం గురించే పలు ఇంటర్వ్యూలలో చెబుతూ నా చివరి కోరిక ఏంటంటే.. నేను చనిపోయాక నా అంత్యక్రియలు తెలుపు రంగుతోనే జరిగాలి. నన్ను వైట్ కలర్ క్లాత్ లోనే పెట్టి అంత్యక్రియలు నిర్వహించాలి అంటూ కోరిందట.

అయితే శ్రీదేవి చివరి కోరిక బతికుండగానే చాలా ఇంటర్వ్యూలలో బయట పెట్టడంతో శ్రీదేవి మరణించాక బోనీ కపూర్ ఆయన పిల్లలు ఇద్దరు శ్రీదేవి చివరి కోరికను తీర్చారు. అలా శ్రీదేవి అంత్యక్రియలో ఆమెని వైట్ క్లాత్ లో చుట్టడంతోపాటు ఆమె దగ్గర పెట్టే పువ్వులు కూడా తెల్ల గులాబీలు,తెల్ల మల్లెపూల తోనే అలంకరించారు. ఇక శ్రీదేవిని అంతిమయాత్రకు తీసుకువెళ్లే వాహనాన్ని కూడా తెలుపు రంగు పూలతో అలంకరించి శ్రీదేవి చివరి కోరికను తీర్చారు.అలా తెలుపు మీద ఉన్న అభిమానంతో శ్రీదేవి చనిపోయేటప్పుడు కూడా తెలుపు రంగు ఉండేలా చూసుకున్నారు.. అలా బోనీకపూర్ ఆయన ఇద్దరు పిల్లలు శ్రీదేవి చివరి కోరికను తీర్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: