నగరి ఎమ్మెల్యే రోజా... సినిమాలnu దూరం పెట్టిన రోజా  ఆ తర్వాత జబర్దస్త్ జడ్జ్  అవతారమెత్తింది. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రజలందరికీ ఎంతో దగ్గర అయిపోయారు రోజా. ఆ తర్వాత జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరి ఓటమిలో గెలుపు ఓటములతో   జగన్ వెంటే ఉన్నారు. అయితే 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు రోజు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ మెజారిటీతో సొంతం చేసుకోగా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు రోజా . అయితే ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటికి అటు  జబర్దస్త్ కామెడీ షో ని మాత్రం వదలలేదు. ఓ వైపు జబర్దస్త్ షో... మరోవైపు రాజకీయాలనూ బాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు రోజ. 

 

 

 

 తాజాగా  క్యాబినెట్ హోదా ఉన్న  ఏపీఐఐసీ చైర్మన్ పదవిని రోజా  చేపట్టారు . అయితే జగన్ పై విమర్శలు చేసిన వారిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తోంది ఎమ్మెల్యే రోజా. ఇక తాజాగా తన నియోజకవర్గమైన నగరిలో ప్లాస్టిక్ నిషేధం దిశగా శ్రీకారం చుట్టారు. నగరి నియోజకవర్గంలో పర్యటించిన రోజా  ఎక్కడికక్కడ ప్లాస్టిక్ పేరుకుపోవడం చూసి  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన పుట్టినరోజు నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వరకు నియోజకవర్గంలో ప్లాస్టిక్ నిషేధానికి నడుంబిగించారు. తన నియోజకవర్గంలో  న్యూ నగరీ నో  ప్లాస్టిక్ అనే  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

 

 

 

 ఈ క్రమంలో వినూత్న ఆలోచన చేసిన ఎమ్మెల్యే రోజా ఒక కిలో ప్లాస్టిక్ ను తీసుకువచ్చి ఇస్తే  వారికి ఒక కిలో బియ్యం ఇస్తామని ప్రకటించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే రోజు. ఎంత బరువు  ప్లాస్టిక్ తీసుకొస్తున్న వారికి అంతే బరువు ఉన్న బియ్యాన్ని  ఉచితంగా ఇస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై మాటల్లో చెబితే ఎవరూ వినరు అందుకే  ఇలాంటి వినూత్న ఆలోచన చేసినట్లు రోజా చెబుతున్నారు . ఒక సెలబ్రిటీ గా ఎమ్మెల్యేగా ఉన్న నేను ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజల్లో అవగాహన వస్తుందంటూ ఆమె భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. పేదవాళ్లు తప్పకుండా తమ ఇంటి చుట్టూ ఉన్న ప్లాస్టిక్ ను  ఇచ్చి బియ్యాన్ని  తీసుకెళ్తారని అన్నారు. నో  ప్లాస్టిక్ న్యూ నగరి  నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది పుట్టినరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు ఎమ్మెల్యే రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి: