2019 ఎన్నికల ఫలితాల దెబ్బకు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మరియు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన టైంలో, 2014 ఎన్నికలలో ఏపీ సీఎం గా గెలిచి జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. అటువంటిది ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుని ఢిల్లీలో ఎవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ పార్టీపై ఫిర్యాదు చేసి జాతీయ స్థాయిలో హైలెట్ అవ్వాలని జాతీయ మీడియాలో ఏదో రకంగా ఆంధ్రాలో అధికారంలో ఉన్న పార్టీపై బురదజల్లే విధంగా వ్యవహరించాలని కుదిరితే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలనీ చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి ఢిల్లీ లో ఉన్నట్లు ఏపీ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
 
ముఖ్యంగా మోడీ ని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నా బిజెపి నాయకులు మాత్రం ససేమిరా అంటున్నారట. కారణం చూస్తే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రచారంలో మోడీ తల్లిపై మరియు ఆయన భార్యపై  చంద్రబాబు కామెంట్లు చేయటమే. ఇదిలా ఉండగా కరోనా కారణంగా ఏపీ రాష్ట్రంలో భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యని అర్జెంటుగా జాతీయస్థాయిలో హైలెట్ చేయాలని చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారట.
 
ఏపీ లో కరోనా సమస్యల్ని కార్నర్ గా చేసుకుని జాతీయ స్థాయిలో జగన్ సర్కార్ పరువు తీయాలని కేంద్రం ఆశీస్సులు పొందాలని… కొన్ని జాతీయ మీడియా ఛానల్స్ ని స్వయంగా పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వాలని ప్రయత్నాలు చేసినా వారు కూడా చంద్రబాబును చాలా లైట్ గా తీసుకోవటం జరిగినట్లు వార్తలు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో వినబడుతున్నాయి. మరోపక్క ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ని ఢీ కొట్టాలంటే కచ్చితంగా కేంద్రం యొక్క అండదండలు ఉండాలని చంద్రబాబు ఎలాగైనా మోడీతో కాంప్రమైజ్ అవ్వాలని అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: