తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికకు నగర మోగడంతో అధికార వైసీపీ ప్రతిపక్ష వైసీపీలు తమ  కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. పరిషత్,మునిసిపల్ ఎన్నికల్లో కొనసాగించిన విజయాన్ని తిరిగి ఏపీలో నమోదు చెయ్యాలని  వైసీపీ భావిస్తుంటే టీడీపీ మాత్రం అందుకు బిన్నంగా తమ అదృష్టాన్ని బద్వేల్ వేదికగా పరీక్షించుకోబోతుంది.అస్సలు  బద్వేల్ ఉప ఎన్నికల బరిలో వైసీపీ,టీడీపీ యిప్పటికే అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ,జనసేన స్టాండ్ ఎలా  ఉండబోతుంది,అస్సలు ప్రభుత్వంపై విపక్షాలు మొత్తం తిరుపతి ఉప ఎన్నికల మాదిరిగా అభ్యర్ధులను బరిలో ఉంచుతాయా  బద్వేల్ ఉప ఎన్నికపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి.


ఏపీలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషీన్ విడుదల చేయడంతో ఏపీలో మరోసారి ఎన్నికల కోలాహలం నెలకొంది ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఊపు మీదున్న వైసీపీ ఉప ఎన్నికల్లో తమ స్థానాన్ని ఎలాగైనా పదిలం చేసుకోవాలని భావిస్తుంది.అందులో భాగంగా వెంకట సుబ్బయ్య మరణం తరువాతగా ఆస్థానంలో ఆయన సతీమణికి దాసరి సుధను బరిలో నింపింది వైసీపీ .2019  ఎన్నికల్లో బద్వేల్ నుంచి విజయం సాధించిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణనించడంతో ఆస్థానంలో ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది.ఎన్నికల్లో వైసీపీకి విజయం కొత్త కాకపోయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న అన్ని అంశాల దృష్ట్యా దదాపు దాసరి సుధను బరిలోకి దింపి తమ విజయ పరంపర కొనసాగించాలని చూస్తుంది.సీఎం జగన్ మోహన్  రెడ్డితో భేటీ అయిన తరువాత ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో ఉప ఎన్నిక పై పెద్ద చర్చ చర్చ జరుగుతుంది.

మరోవైపు ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున కూడా అభ్యర్థిని గతంలోనే ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వకముందే  నెల రోజుల ముందే అభ్యర్థి ని ప్రకటించిన చంద్రబాబు.ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసి ఇప్పటికే బద్వేల్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఓటు బ్యాంకుకు ఘండి కొట్టాలని క్యాడర్ కు  దిశానిర్దేశం చేస్తున్నారు.టిడిపి.2019 సార్వత్రిక ఎన్నికల్లో వెంకట సుబ్బయ్యపై పోటీ చేసి ఓటమి పాలైన ఓబుళాపురం రాజశేఖర్ కు మరోసారి చంద్రబాబు అవకాశం కల్పించారు.అయితే గత అనుభావాలా దృష్ట్యా ముందస్తుగానే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురైనా నుభవాల దృష్ట్యా పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు చంద్రబాబు.
 

ఇదిలా ఉంటె బద్వేల్ ఉప ఎన్నికల బరిలో దిగాలని కార్యాచరణ సిద్ధం చేస్తుంది బీజేపీ,జనసేన కూటమి.తిరుపతి ఉప ఎన్నికల్లో  బరిలోకి తమ అదృష్టాన్ని పరీక్షించుక్కన ఇరు పార్టీలు ఇప్పుడు బద్వేల్ బరిలో దిగేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి,ఇప్పటికే ఉప ఎన్నికపై ఇరు పార్టీల నేతలు కలిసి చర్చించిన  అభ్యర్థిని ఎవరిని నిలపాలని స్పష్ఠత రాకపోవడంతో మరోసారి భేటీ కాబోతున్నారు తరువాత అభ్యర్థిపై  ఒక క్లారిటీ రానుంది.గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దింపగా ఇప్పుడు జనసేనకు అవకాశం అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం.బద్వేల్ సీఎం సొంత జిల్లా కావడంతో ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి బీజేపీ,జనసేన పార్టీలు,త్వరలో సమావేశమైన తరువాత ఎవరిని బరిలోకి దింపాలి అనే అంశాన్ని ప్రకటించనున్నారు ఇరు పార్టీల నేతలు.మొత్తానికి ఉప ఎన్నికకు నగారా మోగడంతో బరిలోకి దిగేందుకు అన్ని పార్టీలు  రంగం సిద్ధం చేస్తుంన్నాయి.చూడాలి మరి రాబోయే రోజుల్లో ఉప ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందో

మరింత సమాచారం తెలుసుకోండి: