
లోకేష్ ఎంత బిజీగా ఉన్నా కూడా... మంగళగిరిలో మాత్రం తరచూ పర్యటిస్తున్నారు. తాజాగా మంగళగిరి లో పర్యటిస్తున్న నారా లోకేష్ ఈ రోజు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పై సూపర్ పంచులతో విరుచుకుపడ్డారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కె నియోజకవర్గానికి గెస్ట్ లెక్చరర్ మాదిరిగా మారారని విమర్శించారు.
వారానికోసారి గౌతమ్ బుద్ధ రోడ్డు ముందు నాలుగు ఫోటోలు దిగి ఆ తర్వాత ఎవ్వరికి కనపడ కుండా జంప్ అయిపోతారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మంగళగిరిలో అభివృద్ధి శూన్యం అంటూ లోకేష్ విమర్శించారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న నియోజకవర్గంలోనే అభివృద్ధికి దిక్కులేదని ఎద్దేవా చేశారు. అత్యంత చెత్త ముఖ్యమంత్రుల జాబితా లో దేశంలోనే జగన్ రెడ్డి నెంబర్ వన్ స్థానంలో ఉంటారని లోకేష్ సెటైర్ వేశారు.
జగన్ రెడ్డి ఉంటోన్న ఇంటికి కూతవేటు దూరంలోనే మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అమ్ముతున్నా కంట్రోల్ చేసే దిక్కులేదని మండి పడ్డారు. ఇక కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని ... పేదల పేరుమీద భూమి ఉందని పెన్షన్లు ఎత్తేస్తున్నారని.. ఇది దారుణం అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో వేలాదిగా వృద్ధాప్య వితంతు పెన్షన్లు తొలగిస్తే ఆర్కే ఏం చేస్తున్నారంఊట ప్రశ్నించారు. గత ఎన్నికల్లో లోకేష్ గెలిస్తే ఇల్లు పీకేస్తాడని ప్రచారం చేసిన ఆర్ కె, ఇప్పుడు పేదవాళ్ల ఇళ్లు కూల్చడం ఘోరం అని ఆయన మండి పడ్డారు.