ఏపీలో భ‌జ‌న బృందం ఒక‌టి ఎప్పటిక‌ప్పుడు రాజ‌కీయం చేస్తూనే ఉంది. జ‌గ‌న్ ద‌గ్గ‌ర మెప్పు పొందేందుకు అదేవిధంగా తమ మాట నెగ్గించుకునేందుకు తెగ ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో సినిమా టికెట్ రేటు తగ్గింపుతో పెద్ద సినిమాలు అనే  కాదు ఓ మోస్త‌రు బ‌డ్జెట్ లో వ‌చ్చిన శ్యామ్ సింగ‌రాయ్ లాంటి సినిమాల‌కూ న‌ష్టాలే మిగిలాయి. మిగ‌ల‌నున్నాయి  కూడా! వాస్త‌వానికి అఖండ లాంటి సినిమా ఓవ‌ర్సీస్ బిజినెస్ ఆదుకున్నా, నానీకి మాత్రం ఆ విధంగా ఏమీ క‌లిసి రాలేదు అటు ప‌ర‌దేశం నుంచి కానీ ఇటు త‌న‌కు బాగా క‌లిసివ‌చ్చిన ఆంధ్రావ‌ని తో స‌హా తెలంగాణ నుంచి కూడా పైస‌లు రాలేదు.




దీంతో ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోవాల్సిన సంద‌ర్భంలో జ‌బర్ద‌స్త్ ఫేం రోజా సెల్వ‌మ‌ణి  మాత్రం ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అత్యంత స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణిలోనే  మ‌ద్ద‌తు ప‌లక‌డం అన్న‌ది టాలీవుడ్ స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కు తావిస్తున్న న‌యా వివాదం. ఒక‌ప్పుడు ఇక్క‌డి నుంచి ఎదిగిన రోజా లాంటి వారు త‌మకు మ‌ద్ద‌తు ఇవ్వ‌కున్నా ప‌ర్లేదు కానీ రాజ‌కీయ దురుద్దేశాలు, దృక్ప‌థాలు త‌మ‌కు అంటించ‌డం భావ్యం కాద‌ని అంటున్నారు ఇంకొంద‌రు సినీ నిర్మాణ వ‌ర్గాలు, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ పెద్ద‌లు కూడా!



 

ఆంధ్రావ‌నిలో థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ‌కూ, ప్ర‌భుత్వం విధించిన టికెట్ రేట్ల‌కు పొంత‌న అన్న‌ది లేకుండా ఉంది. దీంతో రోజురోజుకీ వివాదం ముదురుతోంది. త‌గ్గించిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా తాము థియేట‌ర్ల‌ను న‌డ‌ప‌లేమ‌ని సంబంధిత వ‌ర్గాలు ల‌బోదిబోమంటూ ఉంటే వైసీపీ నాయ‌కులు మాత్రం నోటికి వ‌చ్చిన రీతిన మాట్లాడుతూ త‌రుచూ వివాదాల్లోనే మునిగి తేలుతున్నారు.ఈ ఏడాది బూతులు మంత్రులు ఓ వైపు, రోజా మాట‌లు మ‌రోవైపు అన్న విధంగానే రాజ‌కీయం న‌డుస్తోంది. టీటీడీ ప్రాంగ‌ణంలో స్వామి ద‌ర్శ‌నార్థం వ‌చ్చిన రోజా త‌న‌దైన వ్యాఖ్య‌లు చేయ‌డంతో నిర్మాత‌లు కొంద‌రు మండిప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల‌తో తాము విసిగి వేసారిపోతున్నామ‌ని ఈ త‌రుణంలో సినిమా టికెట్ రేట్లు త‌గ్గించి ఏం సాధిద్దాం అనుకుంటున్నార‌ని వీరంతా గ‌గ్గోలు పెడుతున్నారు. అయితే రోజా ఇదే స‌మ‌యంలో హీరో నానీతో స‌హా ఇంకొంద‌రిని ఉద్దేశించి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం ఆశించే ఆ విధంగా మాట్లాడుతున్నార‌ని రోజా అంటున్నారు. టాలీవుడ్ పెద్ద‌ల కోరిక మేర‌కే తాము కొత్త జీఓ ఇచ్చామ‌ని చెప్ప‌డం కొస‌మెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: