పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, బొగ్గు సరఫరాల్లో అంతరాయం కారణంగా.. కొన్నిరోజులుగా ఏపీలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఇక ఎల్లో మీడియా రెచ్చిపోయింది.. చీకటి పాలన వచ్చిందంటూ ఊదరగొట్టాయి. ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేశారు.


అయితే ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే చర్యలు ప్రారంభించింది. పరిస్థితిని స్వల్ప కాలంలోనే చక్కదిద్దింది. రాష్ట్రం థర్మల్ పవర్ పై దృష్టి పెడుతూ విండ్ ఇంకా సోలార్ పవర్ ను కొనడం లేదంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. విద్యుత్ కొరతను అధిగమించేందుకు కె.ఎస్.కె థర్మల్ కేంద్రానికి సోమవారం రోజు 120 కోట్లు విడుదల చేసింది.


అంతే కాకుండా రాష్ట్రంలోని డిస్కంలు విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. ఆదివారం విద్యుత్ డిమాండ్ 6897 మెగావాట్లు అయితే.. అందుబాటులో ఉన్నది 6670 మెగావాట్లు. అంటే కేవలం 200 మెగావాట్లు మాత్రమే లోటుగా ఉంది. సోమవారం 7,200 మెగావాట్లు డిమాండ్ ఉండగా 6,940 మెగావాట్లు అందుబాటులో ఉంది. 900 మెగావాట్ల లోటును పూడ్చేందుకు పవర్ ఎక్సేంజ్ లో 680 నుంచి 1450 మెగావాట్లను డిస్కంలు కొనుగోలు చేసాయి. జెన్ కో ఉత్పత్తి వరుసగా ఆదివారం 2,777, సోమవారం 2,550 మెగావాట్లుగా ఉంది.


గత కొద్ది రోజులుగా వాతవరణ మార్పుల వల్ల పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. 2018 సెప్టెంబర్ లో జెన్ కో పరిధిలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు 29,543 మెట్రిక్ టన్నులు కాగా 2019 సెప్టెంబర్ నాటికి 46,486 మెట్రిక్ టన్నులు ఉంది. అంటే.. 16000 మెట్రిక్ టన్నులు అంటే దాదాపుగా రెట్టింపు బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు సరఫరా అంతరాయాన్ని అధిగమించేందుకు అదనపు నిల్వలు ఉపయోగపడ్డాయి. అంతే కాదు.. సింగరేణి నుంచి రోజుకు 8 ర్యాకుల బొగ్గు రాబోతోంది. అంటే ఏపీకి కరెంట్ కష్టాలు తీరిపోయినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: