ఆర్థిక సంవత్సరం ప్రతి ఏడాది ఏప్రిల్ లో మొదలై మర్చితో ముగుస్తుంది. ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదిలో పలు పథకాలను ప్రవేశపెట్టింది. ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి మార్చి 31 చాలా కీలకమైన రోజు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు, ఆర్థిక పరమైన అంశాలకు మార్చి 31లోగా పూర్తి చేయాల్సిన 6 ముఖ్యమైన పనుల గురించి తెలుసుకోండి.


కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించిన ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకం గురించి అందరికి తెలిసిందే. ఈ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే నెలకు రూ.1,000 నుంచి రూ.10,000 వరకు పెన్షన్ పొందొచ్చు. గరిష్టంగా నెలకు రూ.10,000, మూడు నెలలకు రూ.30,000, ఆరు నెలలకు రూ.60,000, ఏడాదికి రూ.1,20,000 పెన్షన్ పొందొచ్చు.

 

పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ చాలాకాలంగా కోరుతోంది. ఇప్పటికే 10 సార్లు గడువు పెంచింది. మీ పాన్ నెంబర్‌ను, ఆధార్ నెంబర్‌ను మార్చి 31లోగా లింక్ చేయాల్సిందే. లేకపోతే మీ పాన్ కార్డ్ చెల్లదు. 

 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ స్కీమ్‌కు మొదటిసారి ఇల్లు కొనేవారు అర్హులు. ఎంఐజీ 1, ఎంఐజీ 2 కేటగిరీలో రూ.235000 వరకు వడ్డీపై సబ్సిడీ పొందొచ్చు. ఎంఐజీ 1, ఎంఐజీ 2 కేటగిరీవాళ్లు ఈ బెనిఫిట్ పొందాలంటే 2020 మార్చి 31 చివరి తేదీ.

 

2019-20 అసెస్‌మెంట్ ఇయర్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ. వాస్తవానికి 2019 జూలై 31న గడువు ముగిసింది.పెనాల్టీతో 2019-20 అసెస్‌మెంట్ ఇయర్ ట్యాక్స్ రిటర్న్ మార్చి 31 వరకు ఫైల్ చేయొచ్చు. మీ ఆదాయం రూ.5 లక్షల లోపు అయితే రూ.1000, ఆదాయం రూ.5 లక్షల కన్నా ఎక్కువైతే రూ.10,000 జరిమానా చెల్లించాలి.

 

2019-20 ఆర్థిక సంవత్సరంలో వార్షికాదాయం పన్ను తగ్గించటానికి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మార్చి 31 చివరి తేదీ. 80 సీ సెక్షన్ ద్వారా రూ.1.5 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు.

 

ఈక్విటీ పెట్టుబడులపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్-LTCG ట్యాక్స్ బుక్ చేయాలనుకుంటే 2020 మార్చి 31 వరకే అవకాశం ఉంటుంది. రూ.1,00,000 వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: