ఇప్పుడు కరోనా వైరస్  ప్రపంచ దేశాలన్నీ విలవిల లాడిపోతున్న సంగతి తెలిసిందే.  చిన్నా పెద్ద అనే తేడా ప్రతి ఒక్కరినీ ఈ కరోనా భూతం పట్టి పీడిస్తుంది.  తాజాగా భారత్  లోనూ కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతోంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం సమయానికి భారత్ లో 1173మందికి కరోనా పాజిటివ్ అని తేలగా....కరోనా బారిన పడి 29 మంది చనిపోయారు.

 

మహారాష్ట్రలో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మహారాష్ట్రలో ఏం జరుగుతోందని సీఎం థాకరే కలవరపడుతున్నారు.  ఆ కుటుంబంలోని నలుగురు సభ్యులు సౌదీ అరేబియాలో పర్యటించి కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రకు వచ్చారు. దాంతో ఆ ఇంట్లో ఉన్న 25 మందికి ఈ వైరస్ సోకినట్లు సమాచారం.  దాంతో  మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా ఇస్లామ్‌పూర్‌లో ఓ ఉమ్మడి కుటుంబంలో కలకలం రేగింది. మార్చి 23న వారికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది.

 

దీంతో, ముందు జాగ్రత్త చర్యగా 47 మంది కుటుంబసభ్యులను క్వారంటైన్ కు తరలించారు. తాజాగా 21 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారిలో  రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.   పుణెలో 5, ముంబైలో 3, నాగ్‌పూర్‌లో 2, కొల్హాపూర్‌లో 1, నాసిక్‌లో 1 కేసు నమోదైందని తెలిపారు. . తాజాగా కరోనా బారిన పడ్డ 25 మంది పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నారని, ప్రైమరీ కాంటాక్ట్ కేసులుగా వీటిని పరిగణిస్తున్నామని అన్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: