ఎన్నో తర్జనభర్జనల అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు వారితో వాదించి.... పోట్లాడి ఇక లాభం లేదన్నట్లు పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ ఇంటర్నల్ పరీక్షల్లోని మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చి రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి నీ ఇంటర్మీడియట్ కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది.

 

అయితే విద్యాశాఖ మంత్రి తో మరియు ఇతర ఉన్నతాధికారులతో విషయమై గంటల తరబడి చర్చించిన కేసీఆర్ పనిలోపనిగా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా నిలిచిపోయిన సినిమా మరియు టీవీ సీరియల్ షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే థియేటర్లకు మాత్రం తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరించింది. ఇక్కడ విషయం ఏమిటంటే…. రోజున ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన కేసీఆర్ కీలక నిర్ణయాలను తీసుకోగా కచ్చితంగా ప్రెస్ మీట్ ఉంటుందని అందరూ భావించారు.

 

కానీ అందరి ఊహకు భిన్నంగా ఈసారి కేసీఆర్ మీడియా ముందుకు రాకుండా కేవలం ప్రకటనలు మాత్రమే ఇవ్వడం గమనార్హం. అయితే కేసీఆర్ ఇలా మీడియా ముందుకు రాకపోవడానికి రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ కారణమనే చర్చ మీడియాలో జోరుగా సాగుతోంది. అంతేకాకుండా కేసీఆర్ మీడియా ముందుకు వస్తే కచ్చితంగా రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసిన కేటీఆర్ అక్రమ ఫామ్ హౌస్, 111 జీవో, కేటీఆర్ బర్తరఫ్ అంశం పై మీడియా వారి నుండి ప్రశ్నలు వెల్లువెత్తుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

మరి కేసీఆర్ గురించి తెలిసినవారు ఎవరైనా వీటన్నింటికీ అతను భయపెడతాడా అంటే 'లేదు' అనే చెబుతారు. కానీ ఇంతటి కీలక నిర్ణయాలను కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించకపోవడం లో కెసిఆర్ లో లైఫ్ లో మొట్టమొదటిసారి భయం మొదలైందా…. అని తెలంగాణ ప్రజానీకం చెవులు కొరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: