వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మంత్రి పదవిని ఆశించటం జరిగింది. కానీ జగన్ ఆ చాన్స్ రోజా కి ఇవ్వలేదు. దీంతో కొద్దిగా అలిగిన రోజా పార్టీకి దూరంగా ఉంటూ వ్యవహరించిన తరుణంలో ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా అవకాశమిచ్చారు. అయితే ఇటీవల జగన్ క్యాబినెట్ లో కొన్ని మంత్రి పదవులు ఖాళీ అయ్యే అవకాశాలు వార్తలు వస్తున్న తరుణంలో రోజా స్పీడ్ పెంచినట్లు ఈ సారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకున్నే విధంగా పార్టీలో చక్రం తిప్పుతున్న ట్లు వైసీపీ పార్టీలో ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ఇదే టైమ్ లో తన సన్నిహితులతో కూడా ఈసారి కచ్చితంగా నాకు మంత్రి పదవి వస్తుందని రోజా చెప్పుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

కానీ రోజాకి మంత్రి పదవి దక్కాలంటే సామాజిక న్యాయం జరగాలి అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి పదవి కోల్పోతే గాని ఆ ప్లేస్ లో రోజా వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పటికే క్యాబినెట్ లో  పరిపాలనలో రెడ్డి సామాజిక వర్గానికి వైయస్ జగన్ పెద్దపీట వేస్తున్నట్లు మిగతా సామాజిక వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో రోజా త్వరలోనే మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు చేస్తున్న కామెంట్లు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతున్నాయి. కానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి ఎమ్మెల్యే రోజా పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉందట.

 

పార్టీ కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్న టైంలో పార్టీ వాయిస్ వినిపించటం లో రోజా చాలా కష్టపడిందని జగన్ ఎప్పుడూ పార్టీ సీనియర్లతో అంటారట. దీంతో ఇప్పటికే  ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా  వ్యవహరిస్తున్న రోజాకి త్వరలోనే మంత్రి పదవి కాకపోయినా గానీ కీలకమైన పదవికి సంబంధించి స్వీట్ న్యూస్ జగన్ నుండి రాబోతున్నట్లు వైసీపీ పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: