ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దూకుడు మీద ఉన్నారు. జైలు నుంచి వచ్చాక ఆయన వర్షన్ పూర్తిగా మారినట్లు కనబడుతోంది. మామూలుగానే అచ్చెన్నాయుడు దూకుడుగా ఉంటారు. ప్రత్యర్ధి పార్టీ వైసీపీ అంటే ఒంటికాలి మీద వెళ్తారు. జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతారు. అయితే ఈ ఫైర్ అంతా ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో జైలుకు వెళ్ళి వచ్చాక తగ్గిపోయింది. జైలు నుంచి వచ్చాక అచ్చెన్న ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయలేదు.

నియోజకవర్గానికే పరిమితమై కార్యకర్తలతో మీటింగులు పెట్టుకున్నారు. అయితే ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఎప్పుడైతే చంద్రబాబు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారో అప్పటి నుంచి మళ్ళీ పాత అచ్చెన్న బయటకొచ్చారు. జగన్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళుతున్నారు. ప్రతిరోజూ ఏదొక విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలే చేశారు. టీడీపీకి అంత సత్తా లేకపోయినా సరే, ఏదో ఉందనే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు.

ఈ సమయంలో ఎన్నికలు పెట్టాలంటే వైసీపీ భయపడుతుందని, జనంలో ప్రభుత్వం మీద వ్యతిరేకిత పెరిగిందనే విధంగా అచ్చెన్న విమర్శలు చేస్తున్నారు. అలాగే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ సిద్ధమని చెప్పారు. అలాగే గత నామినేషన్స్ సమయంలో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని చెబుతూ, ఎన్నికలకు మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కోవిడ్ మొదలైనప్పుడు ఎన్నికలు వద్దని ఇప్పుడు, కోవిడ్ నిబంధనలు పాటించి ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ తరుపున నుంచి డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీకి గెలుపు దక్కడం అంత సులువు కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే అధికార వైసీపీపై ప్రజలకు అంత నమ్మకం ఏమి పోలేదు. ప్రజలు ఇంకా జగన్ పట్ల నమ్మకంతోనే ఉన్నారు. ఆయన సంక్షేమ పథకాలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నామమాత్రమైన సీట్లు గెలుచుకున్న కూడా గొప్పే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: