దేశంవ్యాప్తంగా ఈ ఏడాది జూన్‌ 11న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. ఇటు ఈశాన్య రుతుపవనాలు మొదలయ్యాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో చివరి రెండు నెలలు నైరుతి రుతుపవనాలతో వర్షాలు కుమ్మేశాయి. ఈశాన్య రుతుపవనాలు బుధవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి.

ఇక తమిళనాడు దాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు తీరానికి దగ్గరలో ఉన్న నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో గురువారం అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అలాగే ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు వెల్లడించారు. ఈశాన్య రుతు పవనాలు బుధవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా వాతావరణం మారింది. ఈ ఏడాది నైరుతి ప్రభావం రాష్ట్రంలో తక్కువే. కేరళ, కర్ణాటకల్లో కురిసిన వర్షాలకు ఇక్కడి జలాశయాలు నిండాయి. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రుతుపవనాల రూపంలో రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగానే ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఈ పరిస్థితుల్లో బుధవారం ఈ పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారింది. సముద్ర తీర జిల్లాల్లో వర్షం పడడం, వాతావరణం పూర్తిగా మారింది. అండమాన్‌కు సమీపంలో బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడడం, ఈశాన్య రుతుపవనాల రాక వెరసి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది సరాసరి వర్షపాతం ఈ పవనాల రూపంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు  వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: