రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికీ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ పార్టీ కి అన్ని అంశాలు అనుకులిస్తున్నాయి.. దీనికి తగ్గట్లే ప్రజల్లోకి కూడా బాగానే దూసుకువెళ్తుంది.. ఈ దెబ్బతో  టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు.. మిగిలిన సీట్లు కూడా బీజేపీ తీసుకెళ్లేలా ఉంది.. ఇక టీడీపీ పార్టీ ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే  చంద్రబాబు తర్వాత పార్టీ ని నడిపించే సరైన నాయకుడు లేడు.. జగన్ కూడా ఇప్పటిలో అధికారంలోంచి దిగేలా కనిపించడం లేదు..పథకాలు అమలు చేయడం ఒక ఎత్తు అయితే ఆ పథకాలను సరిగ్గా ప్రజలకు అందుతున్నాయా లేదా అని జగన్ స్వయంగా చూసుకోవడం మరొక ఎత్తు అయ్యింది..

అందుకే జగన్ గెలుపు రాష్ట్రంలో ఒక విప్లమని చెప్పాలి.. ఎందుకంటే గెలుస్తుందా గెలవాడా అన్న స్థాయి నుంచి బంపర్ మెజారిటీ తో గెలిచే స్థాయికి వచ్చిన వైసీపీ పార్టీ గెలుపు నిజంగా ఓ విప్లవమని చెప్పాలి..అప్పటికే టీడీపీ బకాసురులు ప్రజలనుంచి దోచుకుని ప్రజలను అణిచివేసే స్థాయికి వచ్చారు.. దాంతో ప్రజలు టీడీపీ ని అధికారంలోకి రానివ్వొద్దని డిసైడ్ అయ్యారు.. దాంతో ప్రత్యామ్నాయంగా కనిపించిన జగన్ ని గెలిపించి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు..   ఇక చంద్రబాబు హయాంలో వైసీపీ ని టీడీపీ ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికి తెలిసిందే.  చంద్రబాబు ప్రభుత్వ హాయంలో చిన్న, పెద్ద నిరసనలను ఉక్కుపాదంతో అణచివేశారు. అలాంటి పనులవల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓడించారు.. బీజేపీ దెబ్బతో  టీడీపీ తెలంగాణా లోలా ఏపీ లో పూర్తి గా తుడిచిపెట్టుకు పోయినట్లే అని చెప్పాలి..దానికి తగ్గట్లు నేతలు కూడా ప్రవర్తిస్తున్నారు.

పొరుగున ఉన్న తెలంగాణాలో రెండవ పక్షంగా ఉన్న కాంగ్రెస్ ని నెట్టేసి మరీ బీజేపీ ఇపుడు ముందుకు దూసుకు వచ్చేసింది. బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికలో చేసిన రీ సౌండ్ కి తెలుగు రాష్ట్రాలు రెండూ గింగిరాలు కొట్టాయి ఇక టీఆర్ఎస్ కి సరైన జవాబు చెప్పిన తెలంగాణా బీజేపీ నేతలను చూసి ఏపీ బీజేపీ నేతలు కాలరెగరేస్తున్నారు. ఏపీలో కూడా రెండవ స్థానంలో ఉన్న టీడీపీని దిగలాగడమే తమ లక్ష్యమని గట్టిగానే శపధాలు చేస్తున్నారు. జగన్ వైపు ఉన్న మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు కనీసంగా కూడా బీజేపీ వైపు తొంగి చూడరు. దాంతో ఇక మీద టీడీపీ టార్గెట్ గా బీజేపీ ఏపీ లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: