ఆంధ్రప్రదేశ్ లో కొంతమందిని రాజకీయంగా ఇబ్బంది పెట్టే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. ప్రధానంగా కొన్ని కుటుంబాలను ఇబ్బంది పెట్టే క్రమంలో రాయలసీమ జిల్లాల్లో తప్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కొంతమంది ని టార్గెట్ గా చేసుకుని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. దీని కారణంగా ప్రజలలో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను చాలా సీరియస్ గా   తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ వైసిపి అలాంటి విషయాల్లో తప్పులు ఎక్కువగా చేస్తుంది అని చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత మంది వైసీపీ నేతలు రాయలసీమ జిల్లాల్లో చేసిన తప్పులు ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే  కుటుంబాలను ఇబ్బంది పెట్టే క్రమంలో దూకుడుగా వెళుతున్నారు. దీంతో పార్టీ కోసం పని చేసే కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల్లో వైసీపీ ఇప్పుడు ఇబ్బందులు పడడానికి ఇదే ప్రధాన కారణమని ఇలాంటి విధానాలు భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని ఏకగ్రీవాలు విషయంలో వైసిపి కక్కుర్తి పడుతుంది అనే వ్యాఖ్యలు చేస్తున్నారు.

అయితే రాజకీయంగా ఇప్పుడు వస్తున్న మరికొన్ని వార్తల ఆధారంగా చూస్తే చాలావరకు వైసీపీ నేతలు కూడా ఇప్పుడు కొంతమంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. మంత్రుల నియోజకవర్గంలో ఏకగ్రీవాలు ఎక్కువగా జరగాలని ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు కూడా ఒత్తిడి ఎక్కువగానే ఉందని అంటున్నారు. స్థానిక నేతలకు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పోటీ చేసే అభ్యర్థులను బెదిరించడంతో ప్రజల్లో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. మైసూర్ బజ్జీలో మైసూర్ లేనట్టు ఎన్నికల్లో ఎన్నిక ఉండదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు భవిష్యతు లో కొనసాగితే వైసిపి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడే అవకాశాలు చాలా తీవ్రంగా ఉంటాయి

మరింత సమాచారం తెలుసుకోండి: