రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కొద్ది రోజులుగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌న కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 2014 రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం తెలంగాణ‌లో , ఇటు ఏపీలో నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌ను పెంచుతామ‌ని పేర్కోన్నారు. దీని ప్ర‌కారం ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 175 స్థానాల స్థానంలో మ‌రో 50 సీట్లు యాడ్ అయ్యి మొత్తం 225 స్థానాలు అవ్వాల్సి ఉంటుంది. ఇక తెలంగాన‌లో ప్ర‌స్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాల స్థానంలో మ‌రో 34 స్థానాలు క‌లిసి మొత్తం 153 స్థానాలు అవ్వాల్సి ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు ఎన్డీయేలో ఉన్న‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే అప్పుడు మోడీ ఆయ‌న గోడును ప‌ట్టించుకోలేదు.

ఇక ఇప్పుడు అటు కేసీఆర్‌, ఇటు జ‌గ‌న్ ఇద్ద‌రూ కూడా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ప‌ట్టించు కోవ‌డం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎమ్మెల్యే సీట్ల సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌స‌భ సీట్లు డ‌బుల్ కాబోతున్నాయా ? అంటే అవున‌న్న ఆన్స‌ర్లే వినిపిస్తున్నాయి. 2024 ఎన్నిక‌ల‌కు ముందే దేశ వ్యాప్తంగా లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌న ఉంటుంద‌ని చెపుతున్నారు.

ఇప్పుడు ఉన్న 545 ఎంపీ సీట్ల స్థానంలో ఎంపీ సీట్లు మొత్తం 1000కు చేరుకుంటాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ పున‌ర్విభ‌జ‌న‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ప్ర‌స్తుతం ఉన్న లోక్‌స‌భ సీట్లు 545. అయితే ఈ సీట్ల సంఖ్య దేశ జ‌నాభా 55 కోట్లుగా ఉన్న‌ప్ప‌టిది. అయితే ఇప్పుడు దేశ జ‌నాభా ఏకంగా 130 కోట్ల‌కు చేరుకుంది. దీంతో ఎంపీల సంఖ్య 1000 దాటిపోనుంది. ఈ క్ర‌మంలోనే ఏపీ, తెలంగాణ‌లో కూడా లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెర‌గ‌నుంది. ఏదేమైనా దేశ వ్యాప్తంగా రాజ‌కీయ నిరుద్యోగుల‌కు ఇది పెద్ద వ‌రంగానే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: