దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి నిందితులెవ్వ‌రూ అరెస్టు కాక‌పోయినా ఈ ప‌ని ఎవ్వ‌రు చేశారు అన్న‌ది తేల‌క‌పోయినా, అభిమానుల ఆవేశం కార‌ణంగానే ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయ‌ని, ఇది కూడా అదే కోవ‌కు చెందింద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ అంటుండ‌డం ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం. అంటే ఇక నిందితుల‌ను ప‌ట్టుకోర‌న్న మాట‌.


తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసిన ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుగుణంగా మ‌లుచుకోవ‌డంలోనే రాజ‌కీయం అంతా దాగి ఉంది. తెలుగు దేశం ప్ర‌భుత్వం ఉన్న కాలంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు లేక‌పోయినా ఒక‌రినొక‌రు తీవ్ర ప‌ద‌జాలంతో తిట్టుకున్న దాఖ‌లాలు  అనేకం అయి ఉన్నాయి. కానీ ఇప్పుడు తొలిసారిగా టీడీపీ రాష్ట్ర కార్యాల‌యంపై జ‌రిగిన దాడికి ఓ ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తి త‌న దైన హో దాలో త‌న‌దైన స్థాయిలో స‌మాధానం చెప్పారు. ఇది విన్న వారంతా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో రెండు వ‌ర్గాలు ఒక‌రిపై ఒక‌రు బాహాబాహికి సిద్ధం అవుతున్నాయి. ఏ ఒక్క‌రినీ వ‌ద‌లం అని ఇరు ప‌క్షాలూ బాగానే స‌వా ళ్లు చేసుకుంటున్నాయి. ఇవి ఎందాక వెళ్తాయో కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ను ఇవి చ‌క్క‌దిద్దుతాయ‌ని మాత్రం  చెప్పేందుకు సా హస‌మే చేయాలి. ఈ త‌రుణంలో టీడీపీ కానీ వైసీపీ కానీ తమ బ‌లం నిరూపించుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి త‌ద్వారా సా నుభూతి పొందాల‌ని యోచిస్తున్నాయి. సానుభూతి రాజ‌కీయాల కార‌ణంగా మంచి పేరు తెచ్చుకోవ‌చ్చ‌న్న త‌ప‌న ప్రతి ఒక్క రాజ కీయ కార్య‌క‌ర్త‌లోనూ క‌నిపిస్తోంది. ఇదే అదునుగా ఇరు వ‌ర్గాలూ రోడ్డెక్కి తీవ్ర ఉద్రిక్త ప‌రిణామాల‌కు చోటిస్తున్నాయి.


ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గన్ వెర్ష‌న్ మరోలా ఉంది. అభిమానులే ఇదంతా చేశార‌ని, ఇందులో త‌మ ప్ర‌మేయం ఏమీ లేద‌ని సీఎం స్ప‌ష్టం చేస్తున్నారు. అ స‌లు వైసీపీకి ఈ త‌గాదాకు ఎటువంటి సంబంధ‌మే లేద‌ని కూడా చెబుతున్నారు. త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగానే కొంద‌రు త ట్టుకోలేక మ‌నో వేద‌న చెంది ఈ దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని చెబుతున్నారు. ఇప్పుడీ మాట‌లే రాష్ట్ర రాజ‌కీ యాల్లో చ‌ర్చ‌నీయాంశం అ య్యాయి. రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేని విధంగా  ఓ పార్టీ  కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని ముఖ్య‌మం త్రి త‌న‌కు అనుగుణంగా స్టేట్మెంట్ ఇవ్వ‌డంపై టీడీపీ పెద‌వి విరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: