టీడీపీ పార్టీ వాళ్లు జనసేన తరఫున ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేయనున్నారు. జనసేనలో రెండు సీట్లు ఖాళీగా ఉండటం వల్ల ఇద్దరు నేతలు అందులోకి వెళ్లి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ. అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి నుంచి సీటు కన్ఫామ్ కావడంతో బుద్ధప్రసాద్ జనసేనలో జాయిన్ కావడానికి ఓకే అన్నారు. టీడీపీ నేత నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. పాలకొండ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం కోసం ఆయన ఈ పని చేశారు. నిజానికి టీడీపీ, జనసేన రెండూ మిత్ర పక్షాలు. మామూలుగా నాయకులు ఒక పార్టీ నుంచి శత్రుపక్షం పార్టీలోకి మారుతుంటారు నాయకులు కానీ వీరు సీట్ల కోసం మిత్రపక్షం నుంచి మరో మిత్రపక్షంలోకే జంపు చేశారు.

వీరు టీడీపీ నేతలు అయినా సరే జనసేన సీట్ల నుంచి పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ సాదరంగా స్వాగతించారు. అంజి బాబు, కొణతాల రామకృష్ణ, వంశీకృష్ణ యాదవులు కూడా జనసేనలోకి బయటనుంచి వచ్చి జాయిన్ అయ్యారు. మొత్తం ఐదుగురు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనకు కేటాయించిన 24 సీట్లలో ఏడు నుంచి 8 మంది మాత్రమే పార్టీని బలంగా నమ్ముకున్నారు. మిగతావారు కొంతమంది ధనవంతులు ఇందులో పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. ఇతరులు పోటీ చేయాలనే భావనతో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లలో కూడా సరిగా అభ్యర్థులను నిలబెట్టలేకపోతున్నాడు అనే విమర్శలు ఇప్పుడు అన్ని చోట్లా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి విమర్శలు వింటే పవన్ కు బాగా కోపం వస్తుందట. ఇకపోతే జనసేన అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే 18 స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం అసెంబ్లీ సీట్లను, మచిలీపట్నం ఎంపీ సీటుకు అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో ఉంచింది. జనసేన అభ్యర్థులు వీళ్లే.. పిఠాపురం- పవన్‌ కళ్యాణ్‌, తెనాలి - నాదెండ్ల మనోహర్‌, అనకాపల్లి - కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్‌ - పంతం నానాజీ, నెల్లిమర్ల - లోకం మాధవి, భీమవరం - పులపర్తి ఆంజనేయులు, ఉంగుటూరు - బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం - గిడ్డి సత్యనారాయణ, రాజోలు - దేవ వరప్రసాద్, నిడదవోలు - కందుల దుర్గేష్, తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాసులు రైల్వేకోడూరు - భాస్కరరావు కాకినాడ (ఎంపీ) - తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: